HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Counter To Alla Ramakrishna Reddy

Nara Lokesh : సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే..!

ఏపీలో ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దూసుకుపోతున్నారు. ప్రచారంలో ఓవైపు ప్రజలకు దగ్గరవుతూనే.. మరో వైపు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

  • Author : Kavya Krishna Date : 01-04-2024 - 8:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh (1)
Nara Lokesh (1)

ఏపీలో ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దూసుకుపోతున్నారు. ప్రచారంలో ఓవైపు ప్రజలకు దగ్గరవుతూనే.. మరో వైపు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ జెండాను ఎగురవేసేందుకు తీవ్ర ఎండను సైతం లెక్కచేయకుండా.. ప్రజల్లోకి వెళ్తున్నారు నారా లోకేష్‌. అయితే.. సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) (Alla Ramakrishna Reddy)పై టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చురకలు అంటించారు. ప్రజాసేవకు అధికారం ఒక్కటే సరిపోదని ఆయన ఉద్ఘాటించారు.. ఇతరులకు సహాయం చేయాలనే సంకల్పాన్ని కూడా కలిగి ఉండాలని నారా లోకేష్‌ అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఓ వికలాంగుడిని పరామర్శించిన ఫొటోలను లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “తాడేపల్లికి చెందిన ఈ వ్యక్తి కోడే కోటేశ్వర రావు (Koda Koteswara Rao). కొన్ని నెలల క్రితం తన కుటుంబాన్ని తన సొంతంగా పోషించుకోవడానికి నేను అతనికి తోపుడుబండి ఇచ్చాను. ఇలాంటి వేలాదిమందికి గత అయిదేళ్లుగా నేను చేయూతనిచ్చా. మహిళల స్వయం ఉపాధి శిక్షణతోపాటు కుట్టుమిషన్లు ఇచ్చా. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటే ట్యాంకర్లు ఏర్పాటుచేశా. 29సంక్షేమ పథకాలను అయిదేళ్లుగా సొంత నిధులతో అమలుచేస్తున్నా. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే నేను చేసిన పనుల్లో పదోవంతైనా సాయం చేశారా? మీరు చేసింది ఏమిటంటే ముఖ్యమంత్రి ఇంటివద్ద ఇరుకుగా ఉందని పేదల ఇళ్లు కూల్చేశారు. ఇప్పటం, ఆత్మకూరులో రోడ్డు విస్తరణ పేరుతో బుల్డోజర్లను పంపి పేదల బతుకులను రోడ్డు పాల్జేశారు. సేవచేయడమంటే కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవడం, పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న పేదల గూళ్లు కూల్చివేయడం కాదు కరకట్ట కమలహాసన్!!’ అంటూ నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా ఆర్కేపై విమర్శలు గుప్పించారు.
Read Also : TDP vs YCP : వైపీసీ కుతంత్రాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ మాస్టర్‌ ప్లాన్‌..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alla Ramakrishna Reddy
  • nara lokesh
  • tdp
  • ysrcp

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • Vaali Lokesh

    Medaram Jathara Kova Bun Controversy : కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ భరోసా !!

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd