Galla Jayadev : గల్లా జయదేవ్‌కు రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఫై లోకేష్ కామెంట్స్
- Author : Sudheer
Date : 28-01-2024 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడం టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న క్రమంలో టీడీపీ పార్టీ కి భారీ షాక్ తగిలినట్లయింది. రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ (MP Galla Jayadev ) ప్రకటించారు. తనను రెండుసార్లు గుంటూరు లోక్ సభ స్థానం (Guntur MP) నుంచి గెలిపించినందుకు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాజకీయాలకు బ్రేక్ తీసుకుంటున్నా. పూర్తిగా బిజినెస్ ఫై దృష్టిసారిస్తా. రాముడు 14 ఏళ్లు వనవాసం వెళ్లి పరాక్రమవంతుడిగా తిరిగొచ్చారు. నేను కూడా అలాగే తిరిగొస్తా. అవకాశం దొరికితే మళ్లీ పోటీ చేస్తా’ అని పేర్కొన్నారు. తన అమరరాజా బ్యాటరీస్ కంపెనీ సహా ఇతర వ్యాపారాలు ఉండడంతో సంస్థను ఇతర దేశాల్లో విస్తరించడం వంటి కార్యకలాపాలు చేపట్టనున్నట్లు గల్లా జయదేవ్ ప్రకటించారు. తాను తన వ్యాపారాలు, రాజకీయాలు కలిపి చేయలేకపోతున్నానని, బిజినెస్ పార్ట్ టైంగా చేయొచ్చు కానీ.. రాజకీయాలు పార్ట్ టైంగా చేయలేమని వివరించారు. అందుకే తాను రాజకీయాల నుంచి వైదొలుతుగుతున్నానని ప్రకటించారు.
ఈ నిర్ణయం ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. రాజకీయాలకు విరామం ప్రకటిస్తూ జయదేవ్ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. అమరావతి రైతుల తరపున జయదేవ్ పోరాటం చేశారని కొనియాడారు. ఆయన కోసం టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయని లోకేష్ స్పష్టం చేశారు. తాము అధికారంలో వున్నప్పుడు ఏనాడూ కంపెనీల జోలికి వెళ్లలేదని, గుంటూరు లాంటి టికెట్‌ను ఏ నేత వదులుకోరని కానీ జయదేవ్ వదులుకున్నారని పేర్కొన్నారు.
Read Also : AP : జగన్..నువ్వు మా బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అని తరిమికొట్టండని బాబు పిలుపు