AP : చంద్రబాబును ఆ స్థితిలో చూసి కన్నీరు పెట్టుకున్న భువనేశ్వరి
ఏసీ గదులలో ఉండాల్సిన తన భర్త...నాల్గు గోడల మధ్య దోమలను కొట్టుకుంటూ..ఆవేదన తో ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. భార్య కన్నీరు పెట్టుకోవడం చూసి..చంద్రబాబు అధైర్య పడవద్దని నిబ్బరంగా ఉండాలని ధైర్యం చెప్పారు
- Author : Sudheer
Date : 25-09-2023 - 8:17 IST
Published By : Hashtagu Telugu Desk
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి.. రాజమండ్రి జైల్లో ఉన్న ఉన్న చంద్రబాబు (Chandrababu) తో ఈరోజు ఆయన సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneshwari ) ములాఖత్ అయ్యారు. 18 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబు ను ఆలా చూసి కన్నీరు (Crying In Rajahmundry Jail) ఆపుకోలేకపోయింది. ఏసీ గదులలో ఉండాల్సిన తన భర్త…నాల్గు గోడల మధ్య దోమలను కొట్టుకుంటూ..ఆవేదన తో ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. భార్య కన్నీరు పెట్టుకోవడం చూసి..చంద్రబాబు అధైర్య పడవద్దని నిబ్బరంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ఇక భువనేశ్వరి తో పాటు కోడలు బ్రాహ్మణి, అచ్చెన్న నాయుడు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి, జైల్లో వసతులపై చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. అరెస్ట్ నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న స్పందనను బాబు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండాలని బాబు సుచినట్లు తెలుస్తోంది. ములాఖత్ నిబంధనల ప్రకారం 45 నిమిషాల పాటు వీరి సమావేశమయ్యారు.
Read Also : AIADMK: బీజేపీతో పొత్తుకు బైబై చెప్పిన ఎఐఎడిఎంకె.. సంబరాల్లో నేతలు..!
అంతకు ముందు ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అన్నవరం దేవస్థానానికి నారా భువనేశ్వరి తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థాన సిబ్బంది.. మర్యాదపూర్వకంగా ఆమెకు ఘన స్వాగతం పలికారు. వారి వెంటే ఉండి దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు నారా భువనేశ్వరి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టీడీపీ నేతలు చేపట్టిన నిరసత దీక్షలో సొమవారం భువనేశ్వరి పాల్గొని సంఘీభావం తెలిపారు.