AP : వైసీపీ లోకి టీడీపీ కీలక నేత..షాక్ లో తెలుగు తమ్ముళ్లు
- By Sudheer Published Date - 11:05 AM, Tue - 20 February 24
 
                        ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార , ప్రతిపక్ష పార్టీల్లో వలసల పర్వం కొనసాగుతుంది. వైసీపీ (YCP) నేతలు టీడీపీ (TDP), జనసేన (Jaasena) పార్టీల్లోకి , టీడీపీ , జనసేన నేతలు వైసీపీ లోకి ఇలా జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆలా జంప్ అవ్వగా..తాజాగా ఇప్పుడు టీడీపీ కీలక నేత వైసీపీ లో చేరబోతున్నట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు (Muddaraboina Venkateswararao) వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో ఆయన సమావేశమయ్యారు. టీడీపీలో చేరిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి చంద్రబాబు నూజివీడు టికెట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో తనకు అన్యాయం జరిగిందంటూ ముద్రబోయిన రెండు రోజుల కిందట కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఇన్నేళ్లు చేసిన కష్టాన్ని పట్టించుకోలేదని, పారాచూట్ నేతలకు టిక్కెట్లు చంద్రబాబు ఇస్తున్నారని ముద్రబోయిన చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు టీడీపీ నుండి వైసీపీ లో చేరేందుకు డిసైడ్ అయ్యారు.
ఇటు వైసీపీ లోను టికెట్ల లొల్లి నడుస్తున్నది. సర్వేల ఆధారంగా జగన్ టికెట్లను ఖరారు చేస్తుండడం తో చాలామంది నేతలకు టికెట్ దక్కడం లేదు. అలాగే నియోజకవర్గ అభ్యర్థుల మార్పులు , చేర్పులు చేస్తుండడం తో వరుస పెట్టి నేతలు బయటకు వస్తున్నారు. మొత్తం మీద టికెట్ల అంశం అన్ని పార్టీలకు తలనొప్పిగా మారింది.
Read Also : Alla Ramakrishna Reddy : మళ్లీ వైసీపీ లోకి RK..షర్మిల కు భారీ షాక్
 
                    



