HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mp Vemireddy Prabhakar Reddy Good Bye To Ycp

Vemireddy Prabhakar Reddy : వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నాడా..?

  • Author : Sudheer Date : 21-02-2024 - 12:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vemireddy Prabhakar Reddy
Vemireddy Prabhakar Reddy

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ టికెట్ దక్కని నేతలంతా వరుస పెట్టి పార్టీ కి గుడ్ బై చెపుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి , జనసేన , టిడిపి లలో చేరగా..మరికొంతమంది ఇదే బాటలో కొనసాగుతున్నారు. తాజాగా నెల్లూరుకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) అతి త్వరలో వైసీపీని వీడుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈసారి నెల్లూరు ఎంపీ (MP) అభ్యర్థిగా అధిష్టానం ఆయనను ప్రకటించింది. అయితే తన లోక్సభ పరిధిలోకి వచ్చే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని ఆయన కోరినా అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే వేమిరెడ్డిని మాజీ మంత్రి నారాయణ, టీడీపీ నేతలు కలిశారు. దీంతో ఆయన టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం నడుస్తుంది.

నెల్లూరు జిల్లాలో తన అనుచర వర్గం, సన్నిహితులతో ఈరోజు భేటీ ఏర్పాటు చేసారు. వైసీపీలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు. అయితే ఆయన కార్యవర్గం మాత్రం సీఎం జగన్ తో చర్చించిన తరువాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని కోరారు. వేమిరెడ్డి మాత్రం అందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. పార్టీ మార్పు పైన సన్నిహితుల నుంచి పునరాలోచన చేయాలనే సూచన వచ్చినప్పటికీ, ఆయన మాత్రం టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని దగ్గరి సన్నిహితులు చెబుతున్నారు. వేమిరెడ్డి పార్టీకి, ఆయన సతీమణి ప్రశాంతి టీటీడీ బోర్డుకు రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. మరి వేమిరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.

Read Also : AP DSC 2024 : ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు.. అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • MP Vemireddy Prabhakar Reddy
  • Nellore
  • tdp
  • ycp

Related News

Nellore Gets India’s First Autonomous Maritime Shipyard

Nara Lokesh: నెల్లూరులో అటానమస్ మారిటైం షిప్ యార్డు.. ప్రపంచంలోనే మొదటిది.!

Nara Lokesh  ఏపీ పారిశ్రామిక రంగంలో మరో సంచలనం నమోదు కాబోతోంది. కేవలం ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలోనే కాదు.. సెక్యూరిటీ, షిప్ బిల్డింగ్ రంగాల్లోనూ ఏపీ సత్తా చాటుతోంది. కూటమి ప్రభుత్వ చొరవతో ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్ యార్డ్ నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఏర్పాటు కాబోతోంది. మంత్రి నారా లోకేష్ చొరవతో సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును

    Latest News

    • Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి

    • IT Park : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..విశాఖ లో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

    • Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

    • Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

    • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

    Trending News

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd