MP Seat : నాగబాబు కు ఎంపీ పోస్ట్ ఫిక్స్..?
Nagababu : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 3 నుంచి 10 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నిక అనివార్యమైతే డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది
- By Sudheer Published Date - 03:50 PM, Wed - 27 November 24

Nagababu : మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) తన తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan Kalayn) కి రాజకీయాల్లో అండగా ఉంటూ వస్తున్నారు. తనకంటూ ఏమి ఆశించకుండా కేవలం తమ్ముడు కోసం పని చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే కూటమి ఏర్పాటు చేయడం కోసం, తన తమ్ముడు కోసం.. సీటుని కూడా త్యాగం చేసారు. తనకి సీటు ఇవ్వకపోయినా పవన్ కోసం.. ఈ ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డారు. తాను మాత్రమే కాదు, తన భార్య పద్మజని, కొడుకు వరుణ్ తేజ్ కి కూడా తీసుకొచ్చి ప్రచారం చేయించారు. పవన్ కోసం పిఠాపురం నియోజకవర్గంలో పద్మజ ఎంతో కష్టపడ్డారు. ఇలా తన కోసం అన్న నాగబాబు చేసిన కష్టానికి తమ్ముడు ప్రతిఫలం అందించబోతున్నట్లు తెలుస్తుంది. నాగబాబు కు ఎంపీ పోస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 3 నుంచి 10 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నిక అనివార్యమైతే డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ పదవులకు రాజీనామా చేయడంతో మూడు సీట్లు ఖాళీ అయ్యాయి. అసెంబ్లీలో ప్రస్తుతం వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో మూడు రాజ్యసభ సీట్లు కూటమికే దక్కనున్నాయి. మూడింటిలో ఒకటి జనసేనకు ఇవ్వాలని.. అది నాగబాబుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో బిజీ బిజీ గా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు , పెండింగ్ బకాయిలు, రాష్ట్రానికి ఏంచేస్తే బాగుంటుందనే అంశాల పట్ల కేంద్ర మంత్రులతో , ప్రధాని మోడీ తో సమావేశమయ్యారు.
Read Also : Pawan Kalyan : కేంద్రం వద్ద పిఠాపురం ప్రస్తావన తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్