I Am With Babu : రేపు జగన్ ప్యాలెస్ దద్దరిల్లిపోయేలా ‘మోత మోగిద్దాం’
ఇక ఇప్పుడు రేపు జగన్ ప్యాలెస్ దద్దరిల్లిపోయేలా 'మోత మోగిద్దాం' (Motha Mogiddham) అంటూ టీడీపీ పిలుపునిచ్చింది.
- By Sudheer Published Date - 03:33 PM, Fri - 29 September 23

I Am With Babu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) చేసిన దగ్గరి నుండి కూడా టీడీపీ శ్రేణులు ఆందోళనలు , నిరసనలు , ధర్నాలు చేస్తూ..చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ..ఆయనకు సంఘీభావం తెలుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఏపీలోనే కాదు తెలంగాణ లోను పెద్ద ఎత్తున చంద్రబాబు అభిమానులు , టీడీపీ శ్రేణులు నిరసనలు తెలిపారు. అలాగే ఐటీ ఉద్యోగులు సైతం పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఇక బయట దేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం చంద్రబాబు కు సపోర్ట్ గా నిలిచారు.
ఇలా ప్రతి ఒక్కరు ఏదొక విధంగా చంద్రబాబు కు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గరి నుండి పండుముసలి వారు వరకు తమ నిరసనగళం తెలిపారు. ఇక ఇప్పుడు రేపు జగన్ ప్యాలెస్ దద్దరిల్లిపోయేలా ‘మోత మోగిద్దాం’ (Motha Mogiddham) అంటూ టీడీపీ పిలుపునిచ్చింది.
Read Also : Jr NTR : టీడీపీ నేతల వల్లే ..ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ ఫై స్పందించడం లేదా..?
‘నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే 🔊. చంద్రబాబు గారికి మద్దతుగా… సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించండి’ మీరు ఏం చేసినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. “5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా ..ఇంట్లోనూ..ఆఫీస్ లోను..ఇంకెక్కడ ఉన్న బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి..లేదా విజిల్ వెయ్యండి. రోడ్ మీద వాహనంతో ఉంటె హారన్ తో కొట్టండి” అంటూ పిలుపునిచ్చారు.
రీసెంట్ గా ఏపీ అసెంబ్లీ లో నందమూరి బాలకృష్ణ సైతం ఇలాగె విజిల్ తో అసెంబీలో లో మోత మోగించిన సంగతి తెలిసిందే. మరి రేపు టీడీపీ శ్రేణులు , బాబు మద్దతుదారులు మోగించే సౌండ్ కు జగన్ ప్యాలెస్ ఏమైపోతుందో చూడాలి.
🧟♂️నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే 🔊. చంద్రబాబు గారికి మద్దతుగా… సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించండి📢🎤. మీరు ఏం చేసినా దాన్ని వీడియో… pic.twitter.com/3WMuhPdw8P
— Telugu Desam Party (@JaiTDP) September 29, 2023