Mohan Babu : టీడీపీలోకి కలెక్షన్ కింగ్ ..?
Mohan Babu : మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద వెలిసిన చంద్రబాబు (CBN), లోకేష్ ఫ్లెక్సీలు(lokesh flexi )చిత్తూరు జిల్లాలో రాజకీయ చర్చకు దారితీసాయి
- By Sudheer Published Date - 06:05 PM, Wed - 22 January 25

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan babu) సైకిల్ (TDP) ఎక్కేందుకు సిద్దమయ్యారా..? అంటే అవుననే అంటున్నారు చిత్తూరు ప్రజలు. తాజాగా మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద వెలిసిన చంద్రబాబు (CBN), లోకేష్ ఫ్లెక్సీలు(lokesh flexi )చిత్తూరు జిల్లాలో రాజకీయ చర్చకు దారితీసాయి. మొన్నటి వరకు వైసీపీకి మద్దతు తెలిపిన మోహన్ బాబు.. తాజాగా టీడీపీతో మళ్లీ సన్నిహితంగా ఉన్నారనే సంకేతాలు అందుతున్నాయి. గతంలో వైసీపీ తరఫున విద్యార్థుల ఓట్లను వైసీపీకి మళ్లించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, ఇప్పుడు టీడీపీ పక్షానికి దగ్గరైనట్లు ఫ్లెక్సీల ద్వారా సంకేతాలు ఇస్తున్నాయి.
Nitish Kumar: రాజకీయాల్లో సంచలనం.. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న నితీష్ కుమార్!
కొద్దీ రోజులుగా మంచు కుటుంబం అంతర్గత విభేదాలు పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అయన టీడీపీ లోకి వెళ్తారని వార్తలు ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారాయి. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి పూర్తి మద్దతు తెలిపిన మోహన్ బాబు, ఆ తరువాత జగన్ ప్రభుత్వంతో దూరం పెంచుకున్నట్లు కనిపించారు. ఫీజు రియంబర్స్‌మెంట్ విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తరువాత ప్రభుత్వం చర్యలపై మౌనం వహించడం ఇవన్నీ వైసీపీతో విభేదాలను సూచించాయి. తాజా ఫ్లెక్సీలను చూస్తుంటే, ఆయన టీడీపీకి మరింత దగ్గరయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం “కన్నప్ప” సినిమా పనుల్లో మోహన్ బాబు నిమగ్నమై ఉన్నారు. అయితే రాజకీయంగా తన పరిస్థితి మరింత క్లిష్టంగా మారకుండా ఉండేందుకే చంద్రబాబు, లోకేష్‌ల ఫోటోలను ప్రచారం చేశారని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తనపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడడమే ఆయన ప్రధాన లక్ష్యమని అనుకుంటున్నారు. మోహన్ బాబు పోస్టర్లపై టీడీపీ వర్గాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ఆయనకు తిరిగి టీడీపీలో స్థానం లభిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.