MLC Vamsikrishna Srinivas : జనసేన లోకి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్..?
- Author : Sudheer
Date : 26-12-2023 - 8:40 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (2024 AP Elections ) సమయం దగ్గర పడుతుండడం తో రాజకీయ నేతలు తమ రాజకీయ భవిష్యత్ ఏ పార్టీ లో ఉంటె బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు (YCP Leaders) సొంత పార్టీని వీడి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీల్లోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారనే సమాచారం అందుతుంది. ప్రజల్లో పార్టీ కి ఉన్న వ్యతిరేకత చూసి కొంతమంది పార్టీ మారాలని చూస్తుంటే..మరికొంతమంది జగన్ ఈసారి టికెట్ ఇవ్వరని ఉద్దేశ్యంతో పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటీకే పలువురు ఆ మేరకు తమ పనులను మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె తాజాగా విశాఖ లో వైసీపీ కి భారీ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తుంది. పార్టీ తీరుపై కొంత కాలం నుంచి అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ వంశీ (MLC Vamsikrishna Srinivas) పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. సుదీర్ఘకాలం సేవలు అందించినా అవమానాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. భీమిలి లేదా విశాఖ సౌత్ నుంచి జన సేన అభ్యర్ధిగా హామీ లభించినట్లు వినికిడి. అందుకే ఆయన జనసేన లో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇక రేపు కాకినాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ మేరకు కార్యకర్తలకు కూడా సమాచారం ఇచ్చారు. పవన్ తో భేటీ తర్వాత వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయి. దీంతో వైజాగ్ వైసీపీలో కలకలం రేగింది.
గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పోరేటర్ గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవి ఆశించారు. అయితే సీఎం జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమారికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనకు గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్ధానిక సంస్ధల కోటాలో వైజాగ్ నుంచి అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచి ఎమ్మెల్సీ అయిన వంశీకృష్ణ.. మండలి సభ్యుడిగా ఉన్నారు.
Read Also : Women Fight In Rtc Bus For Seat : భద్రాచలం ఆర్టీసీ బస్సులో మహిళల సిగపట్లు