MLC Polling: ఓట్ల దందా!మహిళకు 18 మంది భర్తలు,నో డిగ్రీ!
జగన్మోహన్ రెడ్డి అక్రమాల భారతంలో(MLC Polling) తిరుపతి కేబీ లేఅవుట్‌లోని
- By CS Rao Published Date - 03:20 PM, Mon - 13 March 23

మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలని విన్నాం. జగన్మోహన్ రెడ్డి అక్రమాల భారతంలో(MLC Polling) తిరుపతి కేబీ లేఅవుట్‌లోని ఓ మహిళకు (Voters) ఏకంగా 18 మంది భర్తలను క్రియేట్ చేశారు. ఆ విషయాన్ని నారాయణ బయట పెట్టారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని విచిత్రాలో..చెప్పలేం. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్ల దందాను గమనిస్తే ఖాళీ స్థలం ఉన్న అడ్రస్ తో 12 మంది ఓటర్లు ఉన్నారట. ఒక ఇంట్లో 30 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నట్టు, మరో ఇంట్లో 11 ఓట్లు ఉన్నట్టు జాబితాను క్రియేట్ చేశారు. మచ్చుకు ఇవి కొన్ని విచిత్రాలు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం. సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించడం కారణంగా అక్రమ దందాకు వైసీపీ తెరలేపింది.
జగన్మోహన్ రెడ్డి అక్రమాల భారతంలో(MLC Polling)
ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Polling) జరుగుతున్న వేళ తిరుపతిలోని కొన్ని డివిజన్లలో సీపీఐ నేత నారాయణ పర్యటించారు. ఓ ఇంట్లో 30, మరో నివాసంలో 11 ఓట్లు(Voters) నమోదు చేసుండటాన్ని నారాయణ గుర్తించారు. యశోదనగర్ 18-1-90/12జి ఖాళీ ప్రదేశంలో పది దొంగ ఓట్లున్నట్లు తెలుసుకున్నారు. వలంటీర్ ఇంట్లో 12 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. సీపీఎం ఆఫీసు పక్కన లక్ష్మి ఇంట్లో ఎనిమిది దొంగ ఓట్లు ఉన్నట్లు గమనించారు. ఏ చదువూ లేనివారికీ వైసీపీ ప్రభుత్వం గ్రాడ్యుయేట్ ఓటు అర్హత కల్పించడంతో నారాయణ నివ్వెరపోయారు. సుమారు ఏడువేల దొంగ ఓట్లున్నట్లు తిరుపతి నగరంలోనే నమోదు చేసినట్టు అంచనా వేస్తున్నారు. దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన అధికారిని ఉరితీయాలని నారాయణ డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నియోజకవర్గంలో ఈ దొంగ ఓట్ల దందా కొనసాగుతుండడం దుర్గార్మమని నారాయణ అన్నారు.
దొంగ ఓట్ల నమోదు దందా
దొంగ ఓట్లు (Voters) వేయడానికి వచ్చినవారి కాళ్లు విరగ్గొట్టాలని నారాయణ వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని కుయుక్తులు పన్నినా పీడీఎఫ్ అభ్యర్థుల విజయం తథ్యమని నారాయణ జోస్యం చెప్పారు. దొంగ ఓట్ల జాబితా, అర్హత ఉన్న వాళ్లకు ఓట్లను తొలగించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. వాలంటీర్ ఇంట్లో 22 ఓట్లు నమోదు చేయించారు. ఒక మహిళకు 21 మంది భర్తలు ఉన్నట్లు సృష్టించి ఓట్లు నమోదు చేశారు’ అని నారాయణ ఆరోపించారు. డిగ్రీ పట్టా లేకుండా ఓటు హక్కును పొందిన వాళ్ల జాబితా చాండంత ఉంది. స్కూల్ విద్యను అభ్యసించిన వాళ్లకు కూడా గ్రాడ్యుయేట్లు మాదిరిగా ఓటర్లు గా చేర్చారు. అయినప్పటికీ ఏపీ ఎన్నికల కమిషన్(MLC Polling) కళ్లప్పగించి చూస్తోంది.
Also Read : MLC : AP తలరాతను చెప్పే ఎన్నికలు! CBN బహిరంగ లేఖ!!
రాష్ట్ర వ్యాప్తంగా 3 గ్రాడ్యుయేట్, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు జరుగుతోన్న ఎన్నికలను(MLC Polling) రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. కారణం, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు ఇచ్చే తీర్పు జగన్మోహన్ రెడ్డి పాలనకు గీటురాయిగా నిలవనుంది. అదే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు. అదే, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పరిస్థితి పూర్తి భిన్నం. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ప్రభుత్వాన్ని పడగొడతామని కూడా బహిరంగంగా వాళ్లు హెచ్చరించారు. కానీ, ఇప్పుడు ఎన్నికల వచ్చేటప్పటికి పరిస్థితిని పూర్తిగా మార్చేయడానికి వైసీపీ పూనుకుంది. ఆ క్రమంలో ప్రైవేటు టీచర్లను రంగంలోకి దింపింది.
ఐదు నుంచి ఏడో తరగతి వాళ్లకు కూడా డిగ్రీలు ఇచ్చి ఓటర్లుగా
గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు నిరుద్యోగ యువతకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద ఉన్న ఆగ్రహాన్ని తెలియచేస్తుంది. పైగా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లే ఓటర్లుగా ఉంటారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటేస్తారని అంచనా. అందుకే, జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద ప్రజలకు ఉన్న అభిప్రాయం ఈ స్థానాల గెలుపోటముల మీద ఉంటుందని భావించారు. కానీ, వైసీపీ చేసిన దొంగ ఓట్ల దందా గమనిస్తే ఫలితాలను ఎలా. ఆ పార్టీ తారుమారు చేయనుందో అర్థమవుతోంది. కేవలం ఐదు నుంచి ఏడో తరగతి వరకు చదువుకున్న వాళ్లకు కూడా డిగ్రీలు ఇచ్చి ఓటర్లుగా(Voters) చేర్చింది. ఇలాంటి దందా ఇక సాధారణ ఎన్నికల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
Also Read : MLC Elections in AP & Telangana : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Related News

Jagan Rule : మతోత్సాహం, దళిత క్రిస్టియన్లు ఇక ఎస్సీలు!
జగన్మోహన్ రెడ్డి(Jagan Rule) మరో తేనెతుట్టెను కదిలించారు.