MLC Elections Counting : ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌ని తలపిస్తున్న వెస్ట్ రాయలసీమ ఎమ్మెల్సీ కౌంటింగ్
ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ
- By Prasad Published Date - 12:18 PM, Sat - 18 March 23

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీట్లను టీడీపీ కైవసం చేసుకుంది. ఇటు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మాత్రం హోరాహోరీగా నడుస్తుంది. ట్వంటీట్వంటీ మ్యాచ్‌ని తలపించేలా కౌంటింగ్ పక్రియ జరుగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా ఇద్దరి మధ్య హోరాహోరీ నడుస్తుంది. అయితే పీడీఎఫ్ అభ్యర్థికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లపైనే టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఎందుకుంటే టీడీపీ అధిష్టానం బహిరంగంగానే రెండో ప్రాధాన్యత ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేయమని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓట్లు పీడీఎఫ్‌కి వేసిన వారు రెండో ప్రాధాన్యత ఓటు టీడీపీకి వేసే అవకాశం ఉంది. కాబట్టి గెలుపుపై టీడీపీ మాత్రం ధీమాగా ఉంది. ఈ సీటు కూడా గెలిస్తే మూడుకి మూడు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో చేరనున్నాయి.