AP : టీడీపీని విమర్శించలేదనే టికెట్ ఇవ్వలేదు కావొచ్చు – వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి
- By Sudheer Published Date - 08:23 PM, Fri - 19 January 24

వైసీపీ పార్టీ (YCP) లో వరుస పెట్టి నేతలు రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) టికెట్స్ ఇవ్వకపోవడం..నియోజకవర్గాలను మార్చడం వంటివి చేయడం…అలాగే పలు స్థానాల్లో కొత్త వారికీ ఛాన్స్ ఇస్తుండడం తో చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెపుతూ వస్తున్నారు. రీసెంట్ గా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి (Tiruvuru MLA Rakshana Nidhi ) సైతం (Resigns from YCP ) పార్టీ కి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యాడు. తిరువూరు వైసీపీ సీటు తనకి రాదని సమాచారం రావటంతో మనస్తాపం చెందిన రక్షణ నిధి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు.
శుక్రవారం తన కార్యాలయంలో ఎమ్మెల్యే రక్షణ నిధి మీడియాతో మాట్లాడుతూ… తాను 2014, 2019లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇప్పుడు సీఎం జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి కూడా జగన్ మాట తప్పారన్నారు. రెండు సార్లు గెలిచిన తనకు.. ఒక ఎంపీ మాటలు విని సీటు ఇవ్వలేడం లేదని రక్షణ నిధి ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
అన్ని పార్టీల నేతలతో, అన్ని వర్గాల ప్రజలతో మంచివాడినని అనిపించుకున్నానని.. అయినా జగన్ దృష్టిలో తాను మాత్రం పడలేక పోయానని వాపోయారు. వైసీపీలో ప్రతిపక్ష నేతలను పచ్చి బూతులు తిట్టే వారికే పదవులు, సీట్లు ఇస్తారని ఎద్దేవా చేశారు. గడప గడపకు వైసీపీ అని తమను ప్రతి ఇంటికి తిప్పి ఇప్పుడు ఇళ్లల్లో కూర్చున్న వారికి సీట్లు ఇస్తే ఎలా గెలుస్తారని నిలదీశారు. వైసీపీ పెద్దల నిర్ణయంతో తన మనసుకు చాలా కష్టం కలిగిందన్నారు. టీడీపీ కంచుకోట అయినా ప్రాంతాలల్లో కూడా వైసీపీకి బలం పెంచానని అన్నారు.
తనకు సీటు ఇవ్వడం లేదనే విషయంపై 20రోజుల క్రితమే సమాచారం వచ్చిందని.. అప్పటినుంచే పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించి రెండు, మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఏది ఏమైనా ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. గత పదేళ్లలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లను ఎప్పుడూ విమర్శించలేదని.. అందుకే జగన్ టికెట్ ఇవ్వలేదేమో అని చెప్పుకొచ్చారు.
Read Also : Ambedkar Statue : అంబేద్కర్ విగ్రహం అందరికీ స్పూర్తి – సీఎం జగన్