MLA Kethireddy Venkatarami Reddy : పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు.. కానీ.. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూనే పవన్ సీఎం అవుతారు అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
- By News Desk Published Date - 09:00 PM, Mon - 10 July 23

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర(Varahi Yatra) రెండో షెడ్యూల్ లో భాగంగా నిన్న ఏలూరు(Eluru)లో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా సమాచారం కలెక్ట్ చేసి అధికార ప్రభుత్వానికి చెందిన కొందరు వుమెన్ ట్రాఫికింగ్(Women Trafficking) కి పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ(YCP) నాయకులు, వాలంటీర్లు ఫైర్ అవుతున్నారు.
తాజాగా ఈ విషయంపై స్పందిస్తూనే పవన్ సీఎం అవుతారు అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(MLA Kethireddy Venkatarami Reddy). ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీడియాతో పవన్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. పరిపాలనలో వాలంటీర్ వ్యవస్థ చాలా ఉన్నతమైనది. ఒక వాలంటీర్ ఒక నెల రోజులు సెలవు పెడితే మాకు వాలంటీర్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి అని ప్రజలు మొరపెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇంట్లో తండ్రీకొడుకులు మాట్లాడుకుంటారో లేదో తెలియదు కానీ వాలంటీర్లు మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి వారిని బాగా పలకరించి వస్తున్నారు. వాలంటీర్లకు YSRCP అండగా ఉంటుంది అదే క్రమంలోనే తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ స్పందించి అతన్ని పిలిపించి అతని వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించాలి. తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే లీగల్ గా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ బాగుందని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీకుంటున్నాయి అది పవన్ కళ్యాణ్ కు కనపడటం లేదా అని ప్రశ్నించారు.
అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఈరోజు కాకపోయినా రేపైనా పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆయన పరిపాలన చేయలేదు కాబట్టి ప్రజలు కూడా ఆయన సీఎం కావాలని ఆశిస్తున్నారు. కానీ నేను అధికారంలోకి రాను మరొకరికి సహకరించడానికి నేను ఉన్నాను అని పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే. నువ్వు లీడర్ అవుతానంటే అందరూ నీ వెనుక వస్తారు మరొకరి పల్లకి మోస్తాను అంటే నిన్ను అందరిలో ఒకడిగా చూస్తారు. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈ పదేళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకున్నారు. చిరంజీవి పార్టీ ప్రారంభించిన ఎనిమిది నెలల కాలంలో ఎన్నికలకు వెళ్లి 18 సీట్లైనా సాధించారు. పదేళ్ల కాలంలో మీరు గెలవలేకపోయారు. మిమ్మల్ని ప్రజలు ఓడించడానికి వివిధ కారణాలు ఉన్నాయి. మీరు కరెక్ట్ గా ఉంటే భవిష్యత్తు సీఎం అవ్వోచ్చేమో అని అన్నారు. దీంతో YSRCP ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి మహిళా కమీషన్ నోటీసులు.. ఏపీలో పవన్ వ్యాఖ్యలపై రచ్చ..