Missile -Bapatla : బాపట్ల తీరంలో మిస్సైల్.. ఎక్కడిది ?
Missile -Bapatla : బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో మత్స్యకారుల వలకు వాయుసేనకు చెందిన చిన్నపాటి మిస్సైల్ దొరికింది.
- By Pasha Published Date - 07:08 AM, Sat - 9 December 23
Missile -Bapatla : బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో మత్స్యకారుల వలకు వాయుసేనకు చెందిన చిన్నపాటి మిస్సైల్ దొరికింది. ఈ మిస్సైల్‌ను మత్స్యకారులు బోటులో ఒడ్డుకు తీసుకొచ్చారు. దీనిపై మెరైన్ ఎస్ఐ సుబ్బారావు బాపట్ల సూర్యలంకకు చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు. ఈనెల 3 నుంచి 22 వరకు ఎయిర్ ఫోర్స్ సూర్యలంకలోని సముద్ర గగనతలంలో అడ్వాన్స్డ్ మిస్సైల్ సిస్టంపై రిహార్సల్స్ నిర్వహిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
చిన్నపాటి మిస్సైల్‌ను ప్రయోగించి అది లక్ష్యాన్ని చేరుకోకముందే.. సూర్యలంకలోని ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి పేట్రియాట్ మిస్సైల్‌ను ప్రయోగించి పేల్చేసే రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈక్రమంలోనే సముద్రంలో పడిన ఈ చిన్నపాటి మిస్సైల్ సముద్రంలో మత్స్యకారులకు దొరికింది. దాన్ని మెరైన్ అధికారుల సమక్షంలో ఎయిర్‌ఫోర్సు అధికారులకు(Missile -Bapatla) అప్పగించారు.
Related News
DRDO : ‘స్మార్ట్’ సక్సెస్!
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సోమవారం సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ టార్పెడో (SMART)ని పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరంలో ఈ పరీక్ష జరిగింది.