Banana and Milk: పాలు తాగిన తర్వాత అరటిపండు తినొచ్చా ? తినకూడదా?
ఆస్తమా సమస్య ఉన్నవారు అరటిపండు, పాలను కలిపి తినడం పూర్తిగా మానేయాలి. ఇలా తింటే శ్వాసకోశ సమస్యలు ఎక్కువవుతాయి. అలాగే వాంతులు, విరేచనాలు వంటివి
- By News Desk Published Date - 06:00 AM, Sat - 9 December 23

Banana and Milk: అరటిపండు తింటే తక్షణమే శక్తి వస్తుంది. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల క్యాల్షియం పెరిగి ఎముకలు బలంగా మారుతాయి. అందుకే బ్రేక్ ఫాస్ట్ లో ఈ రెండింటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ.. ఆయుర్వేదం ప్రకారం పాలు తాగిన తర్వాత అరటిపండు తినకూడదు లేదా అరటిపండు తిన్నాక పాలు తాగకూడదు. ఈ రెండింటికీ మధ్య కనీసం గంటైనా గ్యాప్ ఉండాలని చెబుతోంది.
ఒకేసారి రెండింటినీ తీసుకోవడం వల్ల శరీరానికి మంచి జరగదని వివరిస్తోంది. అలాగే.. పెరుగన్నం – అరటిపండు, మజ్జిగ అన్నంలో అరటిపండు తినకూడదట. మిల్క్ షేకుల్లో కూడా పాలు , అరటిపండు కలిపి తయారు చేస్తారు. ఇది కూడా మంచిది కాదంటోంది ఆయుర్వేదం.
ఆస్తమా సమస్య ఉన్నవారు అరటిపండు, పాలను కలిపి తినడం పూర్తిగా మానేయాలి. ఇలా తింటే శ్వాసకోశ సమస్యలు ఎక్కువవుతాయి. అలాగే వాంతులు, విరేచనాలు వంటివి కూడా కావొచ్చు. గుండె జబ్బులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది.
కేవలం ఆయుర్వేదంలోనే కాదు.. అల్లోపతిలో కూడా ఇది నిజమని తేలింది. ఇప్పటివరకూ చేసిన అధ్యయనాల్లో పాలు, అరటిపండు కలిపి తినకూడదని తేలింది. గర్భిణీ స్త్రీలు ఈ కాంబినేషన్ కు దూరంగా ఉండాలట. ఈ రెండింటికీ చలువ చేసే లక్షణాలున్నాయి. కాబట్టి శరీరంలో చలువదనం పెరిగి జలుబు, దగ్గు, ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ రెండింటినీ విడివిడిగా తినడమే మంచిది.