Minister Roja Properties : ఐదేళ్లలో మంత్రి రోజా ఆస్తులు ఎంత పెరిగాయో తెలుసా..?
2019లో ఆమె ఆస్తులు రూ.9.03 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.13.07 కోట్లకు పెరిగింది
- By Sudheer Published Date - 05:53 PM, Sat - 20 April 24

నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా (ROja) ఆస్తులు (Properties )..గత ఎన్నికల సమయంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు ఆమె నామినేషన్ చేసిన అఫిడవిట్ చూస్తే అర్ధం అవుతుంది. చిత్రసీమలో హీరోయిన్ గా ఏంటి ఇచ్చి అన్ని భాషల ప్రేక్షకులను అలరించిన ఈమె ..2004లో ఫస్ట్ టైం నగరి నుండి ఎన్నికల బరిలో నిలిచింది. టీడీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఈమె..వైసీపీ లో కూడా అదే పేరును కొనసాగిస్తూ వస్తుంది. 2014లో నగరి నియోజకవర్గ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన రోజా.. 2019 లో కూడా రెండవసారి నగరి నుండి ఎమ్మెల్యేగా గెలిచి ..మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. మంత్రి అయ్యాక ఆమె ఆస్తులు పెరుగుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు మూడోసారి ఆమె ఎమ్మెల్యేగా గెలవాలని చూస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం నగరి నుండి ఆమె నామినేషన్ (Roja Nomination) దాఖలు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ముందుగా పుదుపేట వినాయక స్వామి ఆలయంలో ఆర్కే రోజా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి..అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నగరి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చారు. ఈ సందర్భంగా రోజా నామినేషన్‌తో పాటూ తన ఆస్తుల, అప్పుల అఫిడవిట్‌ను కూడా సమర్పించారు. 2019లో ఆమె ఆస్తులు రూ.9.03 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.13.07 కోట్లకు పెరిగింది. ఇందులో చరాస్తులు రూ.5.09 కోట్లు, స్థిరాస్తులు రూ.7.08 కోట్లని తెలిపారు. రూ. కోటి విలువైన బెంజ్‌తో పాటు 9 కార్లు ఉన్నాయని వెల్లడించారు. తాను ఇంటర్ వరకు చదువుకున్నానని ఆమె తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గతంతో పోలిస్తే రోజా ఆస్తులు కాస్త గట్టిగానే పెరిగినట్లు తెలుస్తుంది. ఇవి అధికారికంగా తెలిపినవే..అనధికారికంగా కొన్ని వందల కోట్లు సంపాదించిందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.
ఇక ఈసారి నగరి లో రోజా గట్టి పోటీనే ఎదురుకోబోతుంది. ఎందుకంటే గతంలో రోజాకు సపోర్ట్ చేసిన వారంతా ఇప్పుడు ఆమెకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఒకానొక సమయంలో వీరంతా రోజా కు టికెట్ ఇవ్వొద్దంటూ గట్టిగా జగన్ ను కోరడం కూడా జరిగింది. కానీ జగన్ ఎవరి మాట వినకుండా ఈమెకు టికెట్ ఇచ్చాడు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
Read Also : Guidelines On Schools: వేసవి నేపథ్యంలో పాఠశాలలకు మార్గదర్శకాలు