Minister Roja : నగరి టికెట్ ఫై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
- Author : Sudheer
Date : 19-12-2023 - 2:50 IST
Published By : Hashtagu Telugu Desk
మరో మూడు నెలల్లో ఏపీ (AP)లో అసెంబ్లీ ఎన్నికలు (AP 2024 Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ (Jagan)..నియోజవర్గాల ఫై మరింత ఫోకస్ పెట్టారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలకు సందేశాలు సైతం పంపారు. ముఖ్యంగా ఈసారి మంత్రులకు టికెట్ కష్టమనే తెలుస్తుంది. ఇందులో ముందు వరుసలో నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. ఇదే విషయాన్నీ మీడియా రోజా (Minister Roja) ను అడుగగా..అది కేవలం శునకానందం మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రతి రోజు నగరి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్తూ, సంక్షేమ పథకాలను అందిస్తూ పల్లె నిద్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని తక్షణమే వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నాని తెలిపారు. ఒకవేళ టికెట్ ఇచ్చిన ..ఇవ్వకపోయినా తాను జగనన్నకు ప్రాణం ఇస్తానని మంత్రి రోజా చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
మంగళవారం ఉదయం శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఏపి పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే. రోజా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. టిడిపి – జనసేన పార్టీలు దిగజారుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని రోజావిమర్శించారు. టిక్కెట్ రాదని చెప్పి టీడీపీకి వైసీపీ అభ్యర్థులను మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జగనన్నపై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందో, అంతకు మూడింతలు పార్టీలో మా అందరికీ ప్రేమ ఉందని, జగన్ సీఎం అవ్వడానికి 100% అందరూ కలిసిమెలిసి పని చేస్తామన్నారు.. సర్వేల ద్వారా చర్చ జరిపి నిర్ణయం కూడా తీసుకున్నారని, ప్రజల వద్ద జగనన్నకు వ్యతిరేకత లేదని రోజా స్పష్టం చేసారు. ప్రజలకు అందుబాటులో లేక సీట్లు లేక పోతే వేరొక పదవి ఇచ్చేలా సీఎం జగన్ చూస్తున్నారని రోజా అన్నారు. నగిరిలో సీటు రోజాకు లేకుంటే ఎవరు నిల్చుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఒక్కచోట నిలబడటానికి భయపడుతున్నారని, అందుబాటులో ఉన్నాం కాబట్టే రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రులు అయ్యామని, 175 సీట్లకి 175 పక్కాగా వైసిపి గెలుపు సాధిస్తుందని అన్నారు.
Read Also : IPL Auction 2024 : కమిన్స్‌కు బంపర్ ఆఫర్.. రూ.20 కోట్లకు దక్కించుకున్న ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’