AP Secretariat Employees : సచివాలయాల ఉద్యోగుల తొలగింపు పై మంత్రి డీబీవీ క్లారిటీ
AP Secretariat Employees : ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించబోమని స్పష్టంగా తెలిపారు. ఉద్యోగులపై భారం తగ్గించేలా కొంత రేషనలైజేషన్ చేపడతామని పేర్కొన్నారు
- By Sudheer Published Date - 08:24 PM, Wed - 21 May 25

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల (AP Secretariat Employees) భవిష్యత్తు పట్ల నెలకొన్న అనుమానాలకు ముగింపు పలుకుతూ రాష్ట్ర మంత్రి డీబీవీ స్వామి (State Minister DBV Swamy) కీలక ప్రకటన చేశారు. ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించబోమని స్పష్టంగా తెలిపారు. ఉద్యోగులపై భారం తగ్గించేలా కొంత రేషనలైజేషన్ చేపడతామని పేర్కొన్నారు. ఇందువల్ల ఎవరికీ ఉద్యోగ భద్రతపై భయాలు అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు.
Sonali Bendre: సోనాలి బింద్రే.. ఒకప్పుడు ఈ పాక్ క్రికెటర్ క్రష్ అని మీకు తెలుసా?
ప్రతి సచివాలయానికి సగటున 7-8 పోస్టులు ఉన్నాయని, వీటి ప్రకారమే పనుల వేతనాలు, బాధ్యతలు పునర్విభజన జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవు, విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ స్థానాల్లోనే కొనసాగుతారు. ప్రతి సచివాలయంపై జిల్లా, మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ జరుపుతారని మంత్రి పేర్కొన్నారు. ఇక సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు. ఉద్యోగుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని, సచివాలయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలు కొంత తగ్గనున్నాయని భావిస్తున్నారు.