Satyameva Jayate : చంద్రబాబు దీక్షను చూసి గాంధీ ఆత్మ క్షోబిస్తోంది – అంబటి
నేడు రాష్ట్రంలో సాగుతున్న ఫ్యాక్షన్ పాలనపై ప్రజల పక్షాన పోరాడుతున్న చంద్రబాబుని జైలులో అక్రమంగా నిర్బంధించారని టీడీపీ పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ చంద్రబాబు కోసం ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ దీక్ష చేపట్టారు
- Author : Sudheer
Date : 02-10-2023 - 3:18 IST
Published By : Hashtagu Telugu Desk
చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) కు నిరసన ఈరోజు గాంధీ జయంతి (Gandhi Jayanthi) సందర్బంగా టీడీపీ శ్రేణులు ‘సత్యమేవ జయతే’ (Satyameva Jayate) దీక్ష చేపట్టారు. నారా లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి , సుహాసిని తదితర నందమూరి ఫ్యామిలీ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. నాడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీని బ్రిటిష్ పాలకులు జైలుకి పంపారు. నేడు రాష్ట్రంలో సాగుతున్న ఫ్యాక్షన్ పాలనపై ప్రజల పక్షాన పోరాడుతున్న చంద్రబాబుని జైలులో అక్రమంగా నిర్బంధించారని టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ చంద్రబాబు కోసం ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ దీక్ష చేపట్టారు.
ఈ దీక్ష ఫై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) ఎద్దేవా చేసారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చంద్రబాబు నిరాహార దీక్ష చేయడాన్ని చూసి గాంధీజీ ఆత్మ క్షోబిస్తోందన్నారు. అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. పవన్ కళ్యాణ్ కాపులు ఉన్న చోటే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. కాపుల ఓట్లను లాక్కునేందుకు చంద్రబాబు పవన్‌తో యాత్ర చేయిస్తున్నారన్నారు. అవనిగడ్డలో టీడీపీ, జనసేన కలిసి నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ అయిందన్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం వల్ల కాపులు జనసేన వారాహి యాత్రకు రాలేదన్నారు. పవన్ టీడీపీతో కలిసి తప్పు చేశారని, అందుకే కాపులు తిప్పి కొట్టారని అంబటి విమర్శించారు.
Read Also : PM Modi: ఈ-వేలంలో మోడీ అందుకున్న బహుమతులు