Nagababu : రాజ్యసభ సీటు పై మెగా బ్రదర్ నాగబాబు ఏమన్నారంటే..?
Nagababu : నా తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే చేస్తాడు. సత్యం, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతాడు
- By Sudheer Published Date - 11:05 AM, Fri - 29 November 24

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 3 నుంచి 10 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నిక అనివార్యమైతే డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ పదవులకు రాజీనామా చేయడంతో మూడు సీట్లు ఖాళీ అయ్యాయి. అసెంబ్లీలో ప్రస్తుతం వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉండడంతో ఈ మూడు రాజ్యసభ సీట్లు కూటమికే దక్కనున్నాయి. మూడింటిలో ఒకటి జనసేనకు ఇవ్వాలని.. అది నాగబాబుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతుండగా..వాటిపై నాగబాబు స్పందించారు.
మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) మొదటి నుండి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan Kalayn) కి రాజకీయాల్లో అండగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. తనకంటూ ఏమి ఆశించకుండా కేవలం తమ్ముడు కోసం పని చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే కూటమి ఏర్పాటు చేయడం కోసం, తన తమ్ముడు కోసం.. సీటుని కూడా త్యాగం చేసారు. తనకి సీటు ఇవ్వకపోయినా పవన్ కోసం.. ఈ ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డారు. తాను మాత్రమే కాదు, తన భార్య పద్మజని, కొడుకు వరుణ్ తేజ్ కి కూడా తీసుకొచ్చి ప్రచారం చేయించారు. పవన్ కోసం పిఠాపురం నియోజకవర్గంలో పద్మజ ఎంతో కష్టపడ్డారు. ఇలా తన కోసం అన్న నాగబాబు చేసిన కష్టానికి తమ్ముడు ప్రతిఫలం అందించబోతున్నారని.. నాగబాబు కు ఎంపీ పోస్ట్ ఇవ్వబోతున్నట్లు..ఇదే విషయాన్నీ తాజాగా ఢిల్లీ టూర్ లో మోడీ వద్ద కూడా ప్రస్తావించినట్లు ప్రచారం అవుతుంది. ఈ ప్రచారం పై నాగబాబు రియాక్ట్ అయ్యారు.
‘నా తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే చేస్తాడు. సత్యం, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతాడు. ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్పవ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని ట్వీట్ చేశారు. నాగబాబు ట్వీట్ బట్టి చూస్తే ఢిల్లీ పెద్దల దగ్గర తన ఎంపీ సీటు ప్రస్తావన తీసుకురాలేదని క్లారిటీ ఇచ్చాడు. మరి నాగబాబు కు ఎంపీ పదవి దక్కుతుందా..లేదా అనేది సస్పన్స్ గానే ఉంది.
అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు,అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే,వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు .
అతను ఎప్పుడు సత్యానికి,ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు పోరాడతాడు. ఢిల్లీ వెళ్లిన purpose స్వార్థ… pic.twitter.com/WMYYnRL0IY— Naga Babu Konidela (@NagaBabuOffl) November 29, 2024
Read Also : Astrology : ఈ రాశివారికి ఆదాయం పెరిగే అవకాశం ఉందట..!