Minister Lokesh : మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేశ్
సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. అందులో అన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు అయ్యాయని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను.
- By Latha Suma Published Date - 01:06 PM, Tue - 8 April 25

Minister Lokesh : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆ వార్త విని షాక్‌కు గురయ్యా. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి. క్లిష్ట సమయంలో పవన్ కుటుంబం ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని లోకేశ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. అందులో అన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు అయ్యాయని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. బాబు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో పవన్ కుటుంబానికి బలం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని మంత్రి లోకేశ్ రాసుకొచ్చారు.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు….
మరోవైపు ఈ ఘటనపై చిరంజీవి స్పందించారు. 8 ఏళ్ల వయసు ఉన్న మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. ఇక, మార్క్ శంకర్ కు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. సింగపూర్ లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్టు తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని కేటీఆర్ అన్నారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
కాగా, సింగపూర్‌లో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు పవనోవిచ్ మార్క్ శంకర్ చదువుకుంటున్నాడు. చిన్నారి చదువుకుంటున్న స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చిన్నారి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read Also: Supreme Court : సుప్రీంకోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట