HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Vallabhaneni Vamsi Remand Extended

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు….

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్‌కు న్యాయస్థానం మరోసారి రిమాండ్ పొడిగించింది. అతని కస్టడీ ముగియడంతో మంగళవారం పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.

  • By Kode Mohan Sai Published Date - 12:58 PM, Tue - 8 April 25
  • daily-hunt
Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్‌కు న్యాయస్థానం మరోసారి రిమాండ్ పొడిగించింది. అతని కస్టడీ ముగియడంతో మంగళవారం పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. విచారణ జరిపిన కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మిగిలిన నిందితులు నేపాల్ లో తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇంకా అరెస్టు కావాల్సిన ప్రధాన నిందితుల్లో, former MLA వల్లభనేని వంశీకి అనుచరుడైన కొమ్మా కోటేశ్వరరావు (కొట్లు) ఒకరు. అతడితో పాటు మరి కొంతమంది నేపాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండగా, వంశీ, వెలినేని శివరామకృష్ణ ప్రసాద్‌, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు.

అయితే, A-5గా ఉన్న ఓలుపల్లి మోహనరంగారావు (రంగా) గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని కిడ్నాప్‌ కేసులో పీటీ వారెంటుపై కోర్టులో హాజరుపరచేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో రంగాతో పాటు కొమ్మా కోట్లు సమాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సత్యవర్ధన్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కోట్లు సేకరించి, రంగాతో పంచుకున్నట్లు సమాచారం. వంశీని అరెస్టు చేసిన తర్వాత వారు ఊరు దాటేశారు.

రంగా ఇటీవల సీఐడీ బృందం చేత ఏలూరులో దొరికాడు. మిగతా ఆరుగురు నిందితుల్లో విశాఖకు చెందిన ఇద్దరు శ్రీకాకుళం వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నేపాల్లో ఉన్న కొమ్మా కోట్లు మరియు మరొక ముగ్గురు నిందితులు అక్కడి నుంచి సన్నిహితులకు ఫోన్ చేసి కేసు విషయాలను, పోలీసుల కదలికలను తెలుసుకుంటున్నట్లు సమాచారం. కొమ్మా కోట్లు రాత్రి సమయాల్లో ఫోన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. పోలీసులు ఆ నలుగురూ నేపాల్లో ఎక్కడుంటున్నారో అని ఆరా తీస్తున్నారు.  పక్కా వివరాలు అందగానే అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Komma Koteswara rao
  • Komma Kotlu
  • Olupalli Mohan Ranga Arrest
  • Satyavardhan Kidnap case
  • Vallabhaneni Vamsi
  • Vallabhaneni Vamsi 14 Days Remand
  • vallabhaneni vamsi custody updates

Related News

    Latest News

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd