Maoist Mother: మావోయిస్టు టాప్ కేడర్ లీడర్ జగన్ తల్లి కన్నుమూత
మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన జగన్ (కాకూరి పండన్న) తల్లి సీతమ్మ కన్నుమూశారు. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.
- Author : Maheswara Rao Nadella
Date : 09-03-2023 - 5:39 IST
Published By : Hashtagu Telugu Desk
మావోయిస్టు (Maoist) అగ్రనేతల్లో ఒకరైన జగన్ (కాకూరి పండన్న) తల్లి (Mother) సీతమ్మ కన్నుమూశారు. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె అనారోగ్యం గురించి తెలుసుకున్న పోలీసుల అధికారులు గత నెల ఆమె ఇంటికి వెళ్లి వైద్య చికిత్సకు అందించారు. వయసు కూడా ఎక్కువ కావడంతో ఆమె ఓక నెల తిరగకుండానే కన్నుమూశారు. జగన్ స్వగ్రామం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీలోని కొమ్ములవాడ గ్రామం. జగన్ ఉద్యమంలోకి వెళ్లినప్పటి నుంచి సీతమ్మ స్వగ్రామంలోనే ఉంటున్నారు. గత నెలలో ఆమె చికిత్స కోసం పోలీసులు సాయం అందించారు. తన తల్లి (Mother) అంత్యక్రియలకు జగన్ హాజరవుతాడేమోనని పోలీసులు భారీ నిఘా పెంచారు.
Also Read: Firefly: డైనోసార్ల టైం కు చెందిన భారీ తుమ్మెద.. వాల్ మార్ట్ స్టోర్ లో గుర్తింపు