Pawan Kalyan : జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ
- By Latha Suma Published Date - 04:47 PM, Mon - 1 April 24

Mandali Buddaprasad: నేడు జనసేన పార్టీ(Janasena party)లోకి మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్(Mandali Buddaprasad)… జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మండలి బుద్ధప్రసాద్ కు పవన్ కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.
We’re now on WhatsApp. Click to Join.
బుద్ధప్రసాద్ అవనిగడ్డకు చెందిన టీడీపీ నేత(TDP Leader). ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, అవనిగడ్డ జనసేనకు కేటాయించగా, మండలి బుద్ధప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. జనసేన పార్టీ అవనిగడ్డ టికెట్ ను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
Read Also: AP : కాంగ్రెస్ ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులు ఖరారు
ఇవాళ పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన వారిలో పాలకొండ నేత నిమ్మక జయకృష్ణ(Nimmaka Jayakrishna) కూడా ఉన్నారు. ఆయన కూడా టీడీపీ(tdp)కి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉన్నందున, నిమ్మక జయకృష్ణకే టికెట్ ఇస్తారని తెలుస్తోంది.
Read Also: KCR : కేసీఆర్ లో భయం మొదలైంది – ఉత్తమ్
జనసేన పార్టీ ఏపీలో టీడీపీ-బీజేపీలతో పొత్తు కారణంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే 19 అసెంబ్లీ స్థానాలకు, 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. ఇక మిగిలింది అవనిగడ్డ, పాలకొండ స్థానాలు. ఇప్పుడు మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణల చేరికతో ఆ రెండు స్థానాలపైనా స్పష్టత వచ్చింది.