HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Manchu Manoj Joins Janasena

Manchu Manoj Joins Janasena : జనసేన లోకి మంచు మనోజ్ దంపతులు..?

Manchu Manoj Joins Janasena : నంద్యాల జిల్లాలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల(Shobha Nagireddy birth Anniversary Celebrations) సందర్భంగా ఈ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది

  • Author : Sudheer Date : 16-12-2024 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Manchu Manoj Janasena
Manchu Manoj Janasena

మంచు మనోజ్‌(Manchu Manoj ) తన భార్య మౌనికతో కలిసి జనసేన పార్టీలో చేరనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. నంద్యాల జిల్లాలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల(Shobha Nagireddy birth Anniversary Celebrations) సందర్భంగా ఈ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కుటుంబ అంతర్గత విభేదాలతో వార్తల్లో నిలిచిన మనోజ్, ఈ నిర్ణయం ద్వారా తన రాజకీయ ప్రస్థానానికి నాంది పలకబోతున్నారని చెబుతున్నారు.

మంచు ఫ్యామిలీ గతంలో వైసీపీ(YCP)లో చేరి 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఇచ్చినా, ఆ తరువాత ఆ పార్టీ కి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల మంచు విష్ణుతో మంచు మనోజ్‌కు తీవ్రమైన వివాదాలు తలెత్తాయి. ఈ వివాదాలు కోర్టు, మీడియా వరకు వెళ్లడంతో, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని మనోజ్‌ పేర్కొనడం పెద్ద సంచలనం రేపింది. మంచు మనోజ్ రాజకీయ ప్రవేశం వెనుక శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి కుటుంబ స్ఫూర్తి ఉందని భావిస్తున్నారు. అఖిల ప్రియ రాజకీయాల్లో కీలకంగా ఉన్నప్పటికీ, మనోజ్ తనదైన మార్గంలో జనసేనలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇది కూడా కుటుంబ విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

మంచు ఫ్యామిలీకి రాజకీయ అనుభవం ఉందనే విషయం తెలిసిందే. అయితే, ఆ కుటుంబంలోని పలువురు ఇప్పటికే బీజేపీ, టీడీపీ పార్టీలతో అనుబంధం కలిగి ఉండగా, మనోజ్ దంపతులు జనసేనలో చేరడం విశేషం. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఈ పార్టీ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో నంద్యాల బయలుదేరడం ఆసక్తి రేపుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం మంచు మనోజ్ దంపతులు జనసేనను ఎంచుకోవడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది.

Read Also : Balakrishna : కోట్లు ఇస్తామన్న బాలకృష్ణ ఆ పని చేయలేదట


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Janasena
  • Manchu Family Issue
  • manchu manoj
  • manchu vishnu
  • Mohanbabu
  • Shobha Nagireddy birth Anniversary Celebrations

Related News

Nara Lokesh

Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

    Latest News

    • ఎంత నీరు తాగినా ఇంకా దాహమేస్తోందా?

    • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

    • చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

    Trending News

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd