HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Management Of Ttd Rooms To The Satisfaction Of The Devotees

TTD : భక్తులు సంతృప్తి చెందేలా టీటీడీ గదుల నిర్వహణ

వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తి చెందేలా గదుల నిర్వహణకు  చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

  • Author : Balu J Date : 18-11-2021 - 4:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తి చెందేలా గదుల నిర్వహణకు  చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్లో గురువారం ఆయన ఆరోగ్య, ఎఫ్ఎంఎస్ విభాగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఫుట్ పాతుల్లో మాస్ క్లీనింగ్ బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళు, తదితరాలు ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని చెప్పారు. భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లలో భూమి కోతకు గురై రోడ్ల మీదికి మట్టి కొట్టుకుని వస్తోందని చెప్పారు. ఇలాంటి మట్టిని ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు, భూమి కోతకు గురైన ప్రాంతాల్లో పూల మొక్కలతో కూడిన ఉద్యానవనాలు పెంచాలని ఆదేశించారు. తిరుమలలోని 7500 గదులు, పిఎసి లు తిరుపతిలోని గదుల్లో శుభ్రత ఎలా జరుగుతోందని ఈవో సమీక్షించారు.

గదుల శుభ్రతకు ఉపయోగించే సామగ్రి, దిండ్లు దుప్పట్లు,  బ్లాంకెట్ల కొనుగోలు విధానం,  కాంట్రాక్టర్ విధానం అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాత్రికులకు కేటాయించే గదుల్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని  చెప్పారు.  తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో  దశలవారీగా ప్లాస్టిక్ వాడకాన్ని రద్దు చేయడానికి చర్యలుతీసుకోవాలన్నారు. తిరుమలలోని దుకాణాల్లో ఎల్ఈడీ లైట్ల వాడకాన్ని అనుమతించరాదని ఆదేశించారు.

లేపాక్షి సర్కిల్ అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న దుకాణాలను వెంటనే ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. తిరుమలలో గదుల నిర్వహణ పారిశుద్ధ్యానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, ఎఫ్ఎంఎస్ విధానం ఎలా ప్రారంభమై ఈ దశకు చేరిందో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జెఈవో శ్రీ వీర బ్రహ్మం, ఎఫ్ఎసిఎఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ శ్రీ జగదీశ్వర రెడ్డి, ఆరోగ్యాధికారి డాక్టర్ శ్రీదేవి, డిఈ శ్రీ రవిశంకర్ రెడ్డి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • rooms
  • ttd
  • ttd board

Related News

Tirumala Seshachalam Forest Department Sets a New Record: CM Chandrababu

Tirumala: తిరుమల శేషాచలం అటవీ శాఖ సరికొత్త రికార్డు: సీఎం చంద్రబాబు

తిరుమల కొండల్లో పచ్చదనాన్ని గణనీయంగా పెంచినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. తిరుమల గిరుల వ్యాప్తంగా 89.40 శాతం అటవీ విస్తీర్ణాన్ని సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీకి అభినందనలు తెలిపారు. Congratulations to Tirumala Tirupati Devasthanams on achieving 89.4% forest cover in Tirumala through sustained conservation measures aimed at protecting forest wealth and restoring native species in […]

    Latest News

    • US Inflation: అమెరికాను వణికిస్తున్న నిత్యావసర ధరల

    • AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..

    • Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి

    • Mega 158: మెగాస్టార్​ చిరంజీవి 158వ సినిమా మొదలు

    • Cm Vijay: తమిళనాడు సీఎం విజయ్‌ మార్క్ పాలన ఇదే

    Trending News

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

      • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd