Amaravati : దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతా – చంద్రబాబు
జగన్ మూడు రాజధానుల పేరుతో నాటకాలాడారని.. చివరకు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు
- Author : Sudheer
Date : 05-05-2024 - 9:14 IST
Published By : Hashtagu Telugu Desk
దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతి (Amaravati )ని తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు (CHandrababu). ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏర్పటుచేసిన భారీ బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్‌షాతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ..”జగన్ మూడు రాజధానుల పేరుతో నాటకాలాడారని.. చివరకు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలోని అనేక సాగునీటి ప్రాజెక్టులను ధ్వంసం చేశారని విరుచుకపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడి ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రధాని మోడీ, అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చారని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హంద్రీనీవా, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి రైతుకు సాగునీరు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని , దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు. ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న దోపిడీకి మే 13న జరిగే పోలింగ్ తో ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు పయనించాలని, కూటమికి ఏ మాత్రం ఢోకా లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో మోదీ 400 సీట్లతో మళ్లీ ప్రధాని కాబోతున్నారని, ఏపీలో 25కి 25 ఎంపీ సీట్లు కూటమి గెలుస్తుందని అన్నారు. 160 సీట్లతో అసెంబ్లీకి వెళుతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు.
Read Also : MS Dhoni 150 Catches: ఐపీఎల్‌లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌కీపర్‌గా ధోనీ రికార్డు