HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mahanadu Meal Menu

Mahanadu 2025 : అదిరిన మహానాడు భోజనం మెనూ..భోజన ప్రియులకు పండగే !!

Mahanadu 2025 : ఉదయం టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్, టీ, కాఫీ ఉంటే, మధ్యాహ్నం గోంగూర చికెన్, ఆంధ్రా చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి లాంటి వంటకాలు వడ్డించనున్నారు

  • Author : Sudheer Date : 27-05-2025 - 11:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahanadu Menu
Mahanadu Menu

కడపలో మహానాడు (Mahanadu 2025 ) వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. మంగళవారం మొదలైన ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ మహానాడుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, పార్టీ శ్రేణులు , అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. వారందరికి ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక వంటకాలను (Mahanadu Food Menu) రుచి చూపించేలా ఏర్పాట్లు చేశారు. చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహారం వడ్డించబోతుండటం విశేషం.

Akhanda Godavari : జూన్లో అఖండ గోదావరి ప్రాజెక్టుకు పవన్ శంకుస్థాపన..అఖండ గోదావరి ప్రాజెక్టు అంటే ఏంటి ?

మొదటి రెండు రోజుల పాటు రోజూ దాదాపు రెండు లక్షల మందికి అల్పాహారం, భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేలా ఏర్పాట్లు చేసారు. గురువారం జరిగే బహిరంగ సభకు భారీగా జనాలు తరలిరావడంతో, ప్రాంగణంలో రెండు లక్షల మందికి ఆహారం అందించేందుకు తోడు, బయట ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. అందులో మూడు లక్షల మందికి భోజనం అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 1,700 మంది వంటవారు, 800 మంది వడ్డించేందుకు నియమించారు.

Former Wyra MLA : వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కన్నుమూత

ఆహార మెనూ విషయంలో ప్రత్యేకత ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్, టీ, కాఫీ ఉంటే, మధ్యాహ్నం గోంగూర చికెన్, ఆంధ్రా చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి లాంటి వంటకాలు వడ్డించనున్నారు. శాఖాహారంలో పూల్ మఖానా, టమాటా పప్పు, ములక్కాయ టమాటా గ్రేవీ, బెండకాయ బూందీ వంటివి ఉండనున్నాయి. సాయంత్రం స్నాక్స్‌లో కార్న్ సమోసా, మిర్చి బజ్జీ, పకోడీ వంటివి ఉంటాయి. రాత్రి వంకాయ బఠాణీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు వంటివి ఉండనున్నాయి. ఈ విస్తృతమైన భోజన ఏర్పాట్లు మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Mahanadu 2025
  • Mahanadu menu
  • nara lokesh
  • tdp

Related News

    Latest News

    • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

    • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd