Chandrababu Lunch Break : లంచ్ బ్రేక్ దాకా చంద్రబాబుకు సీఐడీ వేసిన ప్రశ్నలు అవేనా !?
Chandrababu Lunch Break : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉదయం నుంచి ప్రశ్నిస్తున్న సీఐడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు.
- Author : Pasha
Date : 24-09-2023 - 1:57 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu Lunch Break : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉదయం నుంచి ప్రశ్నిస్తున్న సీఐడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 గంటలకు మళ్లీ చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించడం మొదలవుతుంది. ప్రశ్నించే క్రమంలో.. ప్రతీ గంటకు అధికారులు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నారు. లంచ్ టైంలో చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి వచ్చిన భోజనాన్నే తీసుకున్నారు. ఇక 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబు విచారణ కొనసాగనుంది. విచారణ ముగిసన తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.
Also read : TDP – JSP : నారా బ్రాహ్మణితో జనసేన నేతల భేటి.. తాజా పరిస్థితులపై చర్చ
ఇక విచారణకు 3 గంటల టైమే సీఐడీకి మిగిలి ఉంది. ఈ మిగిలిన సమయంలో చంద్రబాబు నుంచి సాధ్యమైనంత సమాచారాన్ని రాబట్టడమే లక్ష్యంగా సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఉదయం నుంచి అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఇచ్చిన సమాధానాల ఆధారంగా.. మధ్యాహ్నం టైంలో కొత్త ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. చంద్రబాబు నుంచి వచ్చే సమాచారం ఆధారంగా.. మరో రెండు రోజులు కస్టడీని పొడిగించాలని కోరుతూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేసే ఛాన్స్ ఉంది. కిలారి రాజేష్ పాత్రతో పాటు పీఎస్ శ్రీనివాస్ ద్వారా రూ.118 కోట్ల నిధులను దారి మళ్లించారా? అనే కోణంలో లంచ్ బ్రేక్ వరకు ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు కేసు విషయమై నారా లోకేష్ ఢిల్లీలో ప్రముఖ న్యాయవాదులతో మంతనాలు (Chandrababu Lunch Break) జరుపుతున్నారు.