TDP 43rd Foundation Day : రికార్డులు సృష్టించాలన్నా.. వాటిని బద్దలు కొట్టాలన్నా టీడీపీనే – లోకేష్
TDP 43rd Foundation Day : తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ 43 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించారని, కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశ రాజధానిలో తెలుగువారి సత్తా చాటారని ఆయన గుర్తు చేశారు
- By Sudheer Published Date - 01:03 PM, Sat - 29 March 25

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని (TDP 43rd Foundation Day) పురస్కరించుకుని జరిగిన వేడుకల్లో మంత్రి నారా లోకేష్ (Lokesh Speech)ఉత్సాహభరిత ప్రసంగం ఇచ్చారు. రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలు కొట్టాలన్నా టీడీపీకే సాధ్యమని స్పష్టం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ 43 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించారని, కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశ రాజధానిలో తెలుగువారి సత్తా చాటారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ అనుభవం గల పార్టీగా, గల్లీ నుండి ఢిల్లీ వరకు తన ప్రభావాన్ని చూపగలిగే పార్టీగా నిలిచిందని తెలిపారు.
Ghibli Trends : జిబ్లీ ట్రెండ్స్‌లోకి మోడీ, చంద్రబాబు, లోకేశ్.. ఏమిటిది ?
లోకేష్ తన ప్రసంగంలో ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తామని ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడు రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. టీడీపీ గెలుపు ప్రజల విశ్వాసానికి నిదర్శనం అని, కార్యకర్తల అంకితభావం, ప్రజాసేవే ఈ పార్టీని నిలబెట్టాయని అన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అందించిన విలువలను, ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేస్తూ, భవిష్యత్తులోనూ పార్టీ అదే ధోరణిలో ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, ముఖ్యనాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం, పార్టీ జెండాను ఆవిష్కరించారు. లోకేష్ టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మరింత బలంగా పని చేసి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయడమే తమ లక్ష్యమని, టీడీపీ నిరంతరం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.