AP : లోకేష్‌ను టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలి: బుద్దా వెంకన్న
- By Latha Suma Published Date - 11:44 AM, Fri - 24 May 24

Buddha Venkanna: చంద్రబాబు(Chandrababu) అమరావతి(Amaravati)లో ప్రమాణ స్వీకారం చేస్తారని..అయితే ఆరోజే నారా లోకేష్(Lokesh)ను టీడీపీ అధ్యక్షుడుగా(President of TDP) నియమించాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) డిమాండ్ చేశారు. లోకేష్‌ను అధ్యక్షుడుగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందని వెల్లడించారు. ఎన్నికల్లో 130 స్దానాలు కూటమికి వస్తాయని అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం డేట్ భువ నేశ్వరి డిసైడ్ చేస్తారని కూడా బుద్దా వెంకన్న తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఈ ఎన్నికల్లో కూటమి(alliance) అధికారంలోకి రావటం తథ్యమని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. విజయవాడలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఒక్కరే ఇప్పటి వరకు ఒంటి చేత్తో పార్టీని ఈదుతున్నారని.. ఇప్పుడు ఆయనకు లోకేష్, బ్రహ్మణి, భువనేశ్వరి ముగ్గురు తోడయ్యారు.. టీడీపీని మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటే అందరి పాత్ర ఉందన్నారు. 130 స్థానాలకు పైగా కూటమి గెలుస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు ఆత్మ కథ రాసుకుంటే దానిలో నాకు ఒక పేజీ కచ్చితంగా ఉంటుందన్నారు. 2019 నుండి పార్టీ కోసం చాలా కష్టపడ్డానన్నారు. రాజకీయ నాయకుడి పాదాలకు రక్తం తో అభిషేకం చేసిన చరిత్ర లేదు.. ఆ పని తాను చేశానన్నారు.
Read Also: Huge Landslide: విరిగిపడిన కొండచరియలు.. 100 మందికి పైగా మృతి, ఎక్కడంటే..?
3,132 కి మీ 286 రోజుల పాటు పాదయాత్ర చేసిన వ్యక్తి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజే పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ ను ఎన్నుకోవాలని.. ఇది నా విన్నపం కాదు.. డిమాండ్ అన్నారు. చంద్రబాబు దగ్గర నాకు మాట్లాడే చనువు ఉంది కాబట్టే డిమాండ్ చేస్తున్నానన్నారు. ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే మరో 30 ఏళ్లు వెనక్కి చూసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకు అధ్యక్షుడి గా చేసిన అచ్చెన్నాయుడు బాగా పని చేశారన్నారు. అధికారంలోకి రాగానే ఆయనకు మంచి పదవిని చంద్రబాబు ఇస్తారు. పార్టీని కాపాడే యువకుడు.. శక్తి ఉన్న వ్యక్తి లోకేష్ అని అన్నారు.