Nara Lokesh : అక్టోబర్ 04 న లోకేష్ అరెస్ట్..?
అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ ఈ నెల 4న ఏపీ రానున్నారు. అయితే.. విచారణ అనంతరం ఆయనను ఆరెస్ట్ చేస్తారన్న
- By Sudheer Published Date - 06:32 PM, Sat - 30 September 23

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ( Amaravati Ring Road Case)లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh Arrest) ను అక్టోబర్ 04 న CID అధికారులు అదుపులోకి తీసుకోబోతున్నారా..? ప్రస్తుతం సోషల్ మీడియా లోను ఇదే చర్చ నడుస్తుంది. 22 రోజుల క్రితం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఢిల్లీకే పరిమితమయ్యారు. అక్కడే ఉంటూ..చంద్రబాబు కేసులకు సంబంధించి లాయర్లతో సంప్రదింపులు చేస్తూ వస్తున్నాడు.
ఈ తరుణంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ ను A14 గా చేరుస్తూ హైకోర్టు లో ఏపీ సీఐడీ మంగళవారం మెమో దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు లోకేష్ కు ఈరోజు CID నోటీసులు అందజేశారు. ఢిల్లీలో గల్లా జయదేవ్ ఇంట్లో లోకేష్ ఉండడం తో..అక్కడికి వెళ్లి నోటీసులు అందజేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందినట్టు లోకేశ్ సీఐడీ అధికారులకు బదులిచ్చారు. ఈ నేపథ్యంలో లోకేష్ ఈ నెల 4న ఏపీ రానున్నారు. అయితే.. విచారణ అనంతరం ఆయనను ఆరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి అక్టోబర్ 04 ఏం జరగబోతుందో చూడాలి.
Read Also : RBI Extends : రూ.2 వేల నోట్ల మార్పిడి డేట్ ను పొడిగించిన RBI