Liquor scam in AP : తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.3 వేల కోట్లు..?
Liquor scam in AP : మద్యం తయారీదారుల నుంచి నెలకు సుమారుగా రూ.60 కోట్లకు పైగా వసూలు చేసి, దాదాపు రూ.3 వేల కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్(Tadepalli Palace)కు చేరినట్టు ఆరోపణలు
- Author : Sudheer
Date : 15-04-2025 - 10:32 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం(Liquor scam)పై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు చేపట్టింది. ఈ స్కాంలో వైసీపీ కీలక నేతలు పేర్లు వెలుగులోకి వస్తున్నాయన్న వార్తలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మాజీ ఐటీ సలహాదారుడిగా వ్యవహరించిన జగన్ బంధువు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(Kasireddy Rajasekhar Reddy) పై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇటీవల కసిరెడ్డి పై సిట్ అధికారులు హైదరాబాద్‌లోని రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటితో పాటు, కుటుంబ సభ్యుల ఇళ్లపై కూడా దాడులు చేశారు. ఆయన్ని విచారణకు పలుమార్లు పిలిచినప్పటికీ హాజరుకాలేదని అధికారులు వెల్లడిస్తున్నారు.
Robert Vadra : నేనూ పార్లమెంటుకు వెళ్తా.. రాబర్ట్ వాద్రా కీలక ప్రకటన
కసిరెడ్డి లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సినిమాలు, ఆసుపత్రులు, రియల్ ఎస్టేట్ రంగాల్లో బినామీల పేర్లతో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఆయన భార్య డైరెక్టర్‌గా ఉన్న ఆసుపత్రిలో, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. మద్యం తయారీదారుల నుంచి నెలకు సుమారుగా రూ.60 కోట్లకు పైగా వసూలు చేసి, దాదాపు రూ.3 వేల కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్(Tadepalli Palace)కు చేరినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సిట్ దర్యాప్తును వేగవంతం చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కసిరెడ్డి ఎక్కడ ఉన్నారన్న విషయం తెలియడం లేదు. ఆయన నేపాల్ మీదుగా విదేశాలకు వెళ్లినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా జరిగిన ఈ సోదాలతో బినామీ పెట్టుబడిదారుల్లో భయాందోళన మొదలైంది. ఈ పెట్టుబడుల వెనుక వైసీపీకి చెందిన ఇద్దరు ప్రముఖ నేతల ప్రమేయం ఉన్నట్టు సమాచారం. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల ద్వారా పెట్టుబడి పెట్టినట్టు, హైదరాబాద్‌లో నాలుగు ప్రముఖ ఆసుపత్రుల్లో కూడా బినామీ పెట్టుబడులు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా ఈ స్కాం తాడేపల్లి వరకు వెళ్తుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.