Pawan Kalyan : జగన్ కు పదవి గండం ఉందని ఆ మహా కుంభాభిషేకం చేయడం లేదు
శ్రీశైలంలో దక్షిణాయణంలో మల్లికార్జున స్వామి కి మహా కుంభాభిషేకం చేస్తే జగన్ కు పదవి గండం ఉందని కొందరు జ్యోతిష్యులు చెప్పడంతో గత రెండుసార్లు వాయిదా వేశారని..పవన్ పేర్కొన్నారు
- Author : Sudheer
Date : 30-04-2024 - 5:21 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికల ప్రచారం పిక్ స్టేజ్ కి వెళ్తుంది. అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు , ప్రతిసవాళ్లు , ఆరోపణలు , ప్రతిరోపణలతో దద్దరిల్లుతుంది. ముఖ్యంగా జగన్ ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాటలు యుద్ధం చేస్తున్నారు. మొదటి నుండి జగనే లక్ష్యంగా పెట్టుకున్న పవన్..అదే స్థాయిలో విరుచుకుపడుతూ వస్తున్నారు. తాజాగా జగన్ (Jagan) ఫై పలు కీలక ఆరోపణలు చేసారు. శ్రీశైలంలో దక్షిణాయణంలో మల్లికార్జున స్వామి కి మహా కుంభాభిషేకం చేస్తే జగన్ కు పదవి గండం ఉందని కొందరు జ్యోతిష్యులు చెప్పడంతో గత రెండుసార్లు వాయిదా వేశారని..పవన్ పేర్కొన్నారు. కారణం ఏం చెప్పాలో తెలియక ఎండలు బాగా ఉన్నాయని చేయడం లేదని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెపుతున్నాడని పవన్ ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
శ్రీశైలం(Srisailam)లో దక్షిణాయణంలో మల్లికార్జున స్వామి (Mallikarjuna Swamy Temple ) కి మహా కుంభాభిషేకం (Maha Kumbhabhishekam) చేస్తే జగన్ కు పదవి గండం ఉందని కొందరు జ్యోతిష్యులు చెప్పడంతోనే కుంభాభిషేకం చేయకుండా ఉన్నారని..శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమై పోతారని.. తరాలుగా వస్తున్న ఆచారాలను తుంగలో తొక్కి, స్వార్థ ప్రయోజనాల కోసం వైసిపి ఇంత దారుణానానికి ఒడిగట్టిందంటూ పవన్ ఆరోపించారు.
ఇదిలా ఉంటె ఉంటె ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసారు. వైసీపీ మేనిఫెస్టో కంటే ఎంతో బాగుగా టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో ను రిలీజ్ చేసింది. పెన్షన్ దారులకు , ఇల్లు లేని పేదవారికి , నిరుద్యోగులకు ఇలా అన్ని వర్గాల వారికీ మేలు జరిగేలా బాబు మేనిఫెస్టో ను రిలీజ్ చేసారు. దీనిని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తే ఇక కూటమికి తిరుగులేదు.
Read Also : Health: త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే టిప్స్ ఫాలోకండి