AP : పవన్ కళ్యాణ్ కు పోలీసుల నోటీసులు
కృష్ణా జిల్లా పోలీసులు పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసారు. పవన్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా అని నోటీసులిచ్చామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పేర్కొన్నారు
- By Sudheer Published Date - 12:34 PM, Wed - 4 October 23

మరికాసేపట్లో పెడన (Pedana Janasena Meeting) లో భారీ సభ జరగనున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు (Police Notice) ఇచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని..ఇప్పటికే పెద్ద ఎత్తున క్రిమినల్స్ ను దించారని పవన్ అన్నారు. పబ్లిక్ మీటింగ్‌లో రాళ్ళ దాడి చేసి గొడవ చేయాలని ప్లాన్ చేశారంటున్నారన్నారు. తమ పెడన సభలో గొడవలు సృష్టిస్తే.. సహించమని హెచ్చరించారు. సీఎం, డీజీపీ, ఇతర అధికారులు జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలన్నారు. టీడీపీ, జనసేన పొత్తును విచ్చిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాళ్ల దాడి జరిగినా, క్రిమినల్స్ ఎటాక్ చేసినా.. ప్రభుత్వం, డీజీపీలదే బాధ్యత అని అన్నారు. జిల్లా ఎస్పీలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పవన్ విజ్ఞప్తి చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ వ్యాఖ్యలఫై కృష్ణా జిల్లా పోలీసులు పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసారు. పవన్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా అని నోటీసులిచ్చామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పేర్కొన్నారు. ఈ సందర్బంగా కృష్ణాజిల్లా ఎస్పి జాషువా మాట్లాడుతూ.. పెడన పోలీసు స్టేషను పరిధిలో తోటమూల సెంటరులో బహిరంగ సభకు అనుమతి కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసారు…తన సభలో దాడులు జరుగుతాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారని తెలిపారు. అక్కడ పూర్తి విచారణ, పరిశీలన చేసాం.. పవన్ కేడర్ కు ఇచ్చిన సందేశం పైనా పూర్తి పరిశీలన చేసాం…పవన్ కళ్యాణ్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా అని ఆయనకు నోటీసు ఇచ్చామన్నారు. అలాంటి అసాంఘిక శక్తులు ఉంటే చర్యలు కచ్చితంగా తీసుకుంటా…ఎటువంటి సమాచారం తో అలాంటి వ్యాఖ్యలు చేసారని వివరించారు. కానీ తమ నోటీసుకు పవన్ నుండి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదన్నారు.
Read Also : Bananas: ఒకేసారి ఎన్ని అరటిపండ్లు తినొచ్చు..? ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు..?