YCP : పి.గన్నవరం లో వైసీపీకి భారీ షాక్..
వైసీపీకి పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన చిట్టిబాబుకు ఈసారి టిక్కెట్ దక్కలేదు
- By Sudheer Published Date - 01:07 PM, Sat - 13 April 24

ఏపీలో అధికార పార్టీ(YCP)లో వరుస షాకులు తప్పడం లేదు. సోషల్ మీడియా లో మాకు తిరుగులేదు..ప్రజలు మాక్ మద్దతు ఇస్తున్నారని..ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని వైసీపీ ఎంతగా ప్రచారం చేస్తూ వస్తున్నప్పటికీ..లోపల మాత్రం కథ వేరేలా ఉంది. ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని , జగన్ ఫై పూర్తి వ్యతిరేకత తో ఉన్నారని ఆ పార్టీ నేతలు అర్ధం చేసుకొని పార్టీని వీడుతూ వస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది పార్టీని వీడగా..తాజాగా పి. గన్నవరం(P Gannavaram)లో భారీ షాక్ తగిలింది.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీకి పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు (Kondeti Chittibabu) రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన చిట్టిబాబుకు ఈసారి టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన వైసీపీకి పార్టీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నానని చిట్టిబాబు తన రాజీనామా లేఖలో వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే చిట్టిబాబు పార్టీ మారడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. ఇక ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి పి. గన్నవరం నుండి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది.