AP : జైల్లో దోమలు కుట్టక..రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా? – చంద్రబాబు ఫై నాని సెటైర్లు
లోకేష్ తమ పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నాడని, తాము లోకేష్ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమని కొడాలి పేర్కొన్నారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడని ఆయన ప్రశ్నించారు
- Author : Sudheer
Date : 26-09-2023 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయినా సంగతి తెలిసిందే. ప్రస్తుతం 18 రోజులుగా ఆయన రాజమండ్రి జైల్లో (Rajahmundry Central Jail) ఉన్నారు. చంద్రబాబు జైలు కు వెళ్లిన దగ్గరి నుండి రాష్ట్ర వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ..ధర్నాలు , నిరసనలు తెలియజేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ను విడిచిపెట్టడం కానీ , బెయిల్ ఇవ్వడం కానీ చేయకుండా కస్టడీ పెంచుకుంటూ వెళ్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరు వైసీపీ ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తున్నారు.
యావత్ ప్రపంచం చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నా, సంఘీభావం తెలుపుతున్న వైసీపీ నేతలు మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. రోజు రోజుకు మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా ఎమ్మెల్యే కొడాలి నాని (YCP MLA Kodali Nani) చంద్రబాబు అరెస్ట్ ఫై , జైలు జీవితం ఫై సెటైర్లు వేశారు. జైల్లో ఉంటే దోమలు కుట్టక..రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా? అంటూ సెటైర్లు వేశారు. లోకేష్ (Nara Lokesh) తమ పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నాడని, తాము లోకేష్ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమని కొడాలి పేర్కొన్నారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా అని అడిగారు. అడెవడో స్టార్ వస్తే వాడిని లోకేష్ అన్నయ్య అంటాడని పవన్ (Pawan Kalyan) ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఓ పక్కన అన్నయ్యను, మరో పక్క మామయ్య (Balakrishna)ను పెట్టుకుని ఏదో చేద్దామని లోకేష్ అనుకుంటున్నాడన్నారు.
Read Also : UPI Transactions: భారీగా పెరిగిన UPI లావాదేవీలు
2 శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని భువనేశ్వరీ అంటున్నారని, హెరిటేజ్ షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులేమైనా పంచుతారా అని కొడాలి ప్రశ్నించారు. తన భర్తకు వసతుల్లేవు, వేణ్నీళ్లు లేవని భవనేశ్వరీ అంటున్నారని, ఏసీలు.. ఫ్రీజ్ లు, కూలర్లు, బెడ్స్ ఉండడానికి అదేం ఇల్లు కాదు జైలు అన్నారు. జైల్లో ఏమైనా వసతులు కావాలంటే కోర్టును అడగాలన్నారు. బాబుతో నేను అంటూ కార్యక్రమాలు చేసేవాళ్లు, బాబుతో పాటు జైలుకెళ్తారా అని కొడాలి ప్రశ్నించారు. చంద్రబాబు కోసం ఎవ్వరూ పాదయాత్రలు చేయరు.. కార్ల యాత్రలు చేస్తారన్నారు. చంద్రబాబు కోసం యాత్రలు చేసేది కమ్మోళ్లు మాత్రమే అన్నారు. తమ వాళ్లకే కార్లు ఎక్కువగా ఉన్నాయన్నారు.