Kiran Kumar Reddy : కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి.. తక్కువ కాలంలోనే జాతీయ స్థాయి కమిటీలోకి
రాజకీయాల్లో కిరణ్ కుమార్ రెడ్డికి సుదీర్ఘ అనుభవం ఉండటంతో బీజేపీ హైకమాండ్ ఆయన పార్టీలో చేరిన కొద్దికాలంకే బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమించింది.
- Author : News Desk
Date : 04-07-2023 - 9:54 IST
Published By : Hashtagu Telugu Desk
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) ఇటీవల బీజేపీ (BJP) లో చేరిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరిన కొద్దికాలంలోనే కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ కేంద్ర పార్టీ కీలక పదవి అప్పగించింది. మంగళవారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్టీ నూతన అధ్యక్షుల నియామకం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ నూతన అధ్యక్షుల నియామకం చేస్తూ బీజేపీ కేంద్ర పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే.. ఏపీ బీజేపీ అధ్యక్షులుగా ఉన్న సోము వీర్రాజును ఆ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవటంతో పాటు దగ్గుబాటి పురంధేశ్వరికి ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ బీజేపీ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టింది.
The BJP National President Shri @JPNadda has appointed Shri Kiran Kumar Reddy, the Former Chief Minister of Andhra Pradesh, as the Member of the National Executive Committee, BJP. pic.twitter.com/R9B2WlSQox
— BJP (@BJP4India) July 4, 2023
కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం సేవలందించారు. స్పీకర్‌గానేకాక, ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగానూ కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ప్రత్యేక రాష్ట్రం తరువాత 2014లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యాడు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. గత కొద్దినెలల క్రితం కిరణ్ కుమార్ మళ్లీ బీజేపీలో చేరి పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో కిరణ్ కుమార్ రెడ్డికి సుదీర్ఘ అనుభవం ఉండటంతో బీజేపీ హైకమాండ్ ఆయన పార్టీలో చేరిన కొద్దికాలంకే బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.