HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Key Development In Jagans Assets Case Crucial Report Submitted To Supreme Court

YS Jagan Assets Case: జగన్ ఆస్తుల కేసులో కీల‌క ప‌రిణామం.. సుప్రీంకోర్టు చేతికి కీలక నివేదిక..

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో వివ‌రాల‌తో కూడిన నివేదికను సీబీఐ, ఈడీ సుప్రీంకోర్టుకు అందజేశాయి. ఆ నివేదికను ప‌రిశీలించిన తర్వాత తీర్పు ఇవ్వాల్సి ఉన్నట్లు కోర్టు తెలిపింది. అలాగే, అక్రమాస్తుల కేసు బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది.

  • By Kode Mohan Sai Published Date - 11:22 AM, Sat - 14 December 24
  • daily-hunt
Ys Jagan Assets Case
Ys Jagan Assets Case

YS Jagan Assets Case: మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేసులో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆయ‌న‌పై కేసుల‌కు సంబంధించి వివ‌రాల‌ను సీబీఐ, ఈడీ సుప్రీం కోర్టుకు ప‌రిశీల‌న కోసం అంద‌జేశాయి. ఆ నివేదిక‌ను పరిశీలించ‌డానికి సుప్రీం కోర్టు సమ‌యం తీసుకున్న‌ది. “తీర్పు ఇవ్వ‌డానికి ముందు ఆ నివేదికను ప‌రిశీలిస్తాం” అని సుప్రీం కోర్టు ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. అనంత‌రం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్ల‌పై విచారణ జ‌న‌వ‌రి 10 కి వాయిదా ప‌డింది.

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేసుల విచారణలో జాప్యంపై సీబీఐ, ఈడీ అఫిడవిట్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణలో జాప్యంపై సీబీఐ, ఈడీ తమ నివేదికను అఫిడవిట్ రూపంలో సుప్రీం కోర్టుకు దాఖలు చేశాయి. విచారణ జాప్యానికి కారణాలను వివరించే విధంగా ఈ నివేదికలో దర్యాప్తు సంస్థలు వివరణలు ఇచ్చాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యం అవుతోందని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, కేసులు వేగవంతం చేయాలనీ, అవసరం అయితే వాటిని మ‌రో రాష్ట్రం లేదా ఇతర ప్రాంతానికి బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా, ఆయన వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని, లేకపోతే విచారణపై తీవ్ర ప్రభావం పడుతుందని మరో పిటిషన్ కూడా దాఖలు చేసారు.

ఈ పిటిషన్లను శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ కూడిన ధర్మాసనం విచారించింది. సీబీఐ, ఈడీ తరపు న్యాయవాది అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ (ఎఎస్‌జీ) రాజ్‌కుమార్ భాస్కర్‌ ఠాక్రే వాదనలు వినిపిస్తూ, గురువారం సాయంత్రం సీబీఐ, ఈడీ కేసుల స్టేటస్ రిపోర్టులను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. దర్యాప్తు సంస్థలు సమర్పించిన స్టేటస్ రిపోర్టు కాపీని కోర్టు పరిశీలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపు సీనియ‌ర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, తమకు కూడా నివేదికను ప‌రిశీలించ‌డానికి కొంత సమయం ఇవ్వాలని కోర్టుకు అభ్యర్థన చేశారు.

సుప్రీం కోర్టు దర్యాప్తు సంస్థలను ప్రశ్నించింది

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసుల విచారణలో జాప్యం ఎందుకు జరుగుతుందో తెలియజేయాలని సుప్రీంకోర్టు గతంలో దర్యాప్తు సంస్థలను ప్రశ్నించింది. ఈనెల 2న (సోమవారం) విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం సీబీఐ, ఈడీకి కేసుల స్టేటస్‌ వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో కేసుల పురోగతి, ప్రస్తుత పరిస్థితి, తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, మరియు ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను వివరించే అఫిడవిట్ రూపంలో స్టేటస్ రిపోర్టును కోర్టులో సమర్పించాయి. సీబీఐ, ఈడీ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తర్వాతే తీర్పును వెల్లడిస్తామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం స్పష్టం చేసింది.

వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో మొత్తం 125 పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడయింది. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దాఖలైన పిటిషన్లలో దాదాపు 80 శాతం పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని శుక్రవారం జ‌రిగిన విచారణలో రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ కోర్టుకు వివరించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CBI ED Report On YS Jagan Assets
  • Deputy Speaker Raghurama Krishnaraju
  • Supreme Court
  • ys jagan
  • YS Jagan Assets Case

Related News

Supreme Court Dismissed The

Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

Vote For Note Case : ఈ కేసులో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కి వాయిదా వేసింది

  • Botsa Satyanarayana

    YCP: కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ కార్మిక బిల్లుపై వైసీపీ తీవ్ర అభ్యంత‌రం!

  • Jacqueline Fernandez

    Jacqueline Fernandez: రూ. 200 కోట్ల మోసం కేసు.. స్టార్ హీరోయిన్‌కు సుప్రీంకోర్టులో షాక్‌!

  • Vijayawada Utsav Sh

    Vijayawada Utsav 2025: ‘విజయవాడ ఉత్సవ్’కు తొలిగిన అడ్డంకి

Latest News

  • KhawajaAsif ఆర్మీతో కలిసే పని చేస్తున్నాం : ఖవాజా ఆసిఫ్

  • Nani Pardije : నాని ‘ది ప్యారడైజ్’ నుండి మోహన్ బాబు లుక్ రిలీజ్

  • Asia Cup 2025 Final: రేపే ఆసియా క‌ప్ ఫైన‌ల్‌.. టీమిండియాకు బిగ్ షాక్‌?

  • Musi Rejuvenation : హైదరాబాద్ వరదలకు చెక్ పెట్టబోతున్న సీఎం రేవంత్

  • Floods In HYD : సీఎం రేవంత్ వల్లే నేడు హైదరాబాద్ జ‌ల దిగ్బంధం – హరీష్ రావు

Trending News

    • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd