Saraswati Lands : ‘సరస్వతి’ భూముల విషయాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
Saraswati Lands : కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ (Pawan Kalyan) ఈ భూములను పరిశీలించారు. జగన్ భూములను చెరబట్టారని ఆరోపిం చారు. పల్నాడు జిల్లా మాచవరం తహశీల్దార్ ఎం.క్షమారాణి (Tehsildar M. Kshamarani) ఈ విషయాన్ని ప్రకటించారు
- Author : Sudheer
Date : 12-12-2024 - 3:25 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ సీఎం జగన్ (Jagan) కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లోని అసైన్డ్ భూములను (Saraswati Lands) చంద్రబాబు ప్రభుత్వం (AP Govt) వెనక్కు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ (Pawan Kalyan) ఈ భూములను పరిశీలించారు. జగన్ భూములను చెరబట్టారని ఆరోపిం చారు. పల్నాడు జిల్లా మాచవరం తహశీల్దార్ ఎం.క్షమారాణి (Tehsildar M. Kshamarani) ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం 17.69 ఎకరాలు భూములను స్వాధీనం చేసుకోవడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూముల్లో 13.80 ఎకరాలు వేమవరం మండలం పరిధిలో, 3.89 ఎకరాలు పిన్నెల్లి మండలంలో ఉన్నాయి. ఈ భూములను ప్రభుత్వ రికార్డుల్లో తిరిగి చేర్చుకోవాలని నిర్ణయించారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన భూముల పట్ల ప్రభుత్వ నియంత్రణను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
రీసెంట్ గా సరస్వతి పవర్ కంపెనీకి వేమవరం, చెన్నాయపాలెం, పిన్నెల్లి గ్రామాల పరిధిలో దాదాపు 2 వేల ఎకరాల భూములు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ భూములను తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకోబడింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది భూములను వినియోగాన్ని సరిగ్గా నిర్వహించడం కోసమే తప్ప మరోటికాదు. ఈ నిర్ణయం గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందని, భూముల న్యాయమైన వినియోగం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
పల్నాడులో జగన్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం భూములు తీసుకున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలోనూ ఈ భూ కేటాయింపులు జరిగాయి. దీని పైన అప్పట్లోనే వివాదం చోటు చేసుకుంది. అయితే, ఆ తరువాత జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జగన్ -షర్మిల వివాదం లోనూ సరస్వతి పవర్ అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కాగా, కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ పల్నాడులో సరస్వతి పవర్ కు కేటాయించిన భూములను పరిశీలించారు. ఆ సమయంలోనే 1324. 93 ఎకరాల భూమిని చెరబట్టారని ఆరోపించడం జరిగింది.
Read Also : Jamili Elections : జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం