YCP : కడప జిల్లాలో ఊపిరి పీల్చుకున్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు
- By Sudheer Published Date - 10:57 AM, Fri - 12 January 24

రాబోయే ఎన్నికల్లో 175 కు 175 సాధించాలని వైసీపీ అధినేత , సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇవ్వాలని భావించిన జగన్..వరుస గా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నారు. పలు సర్వేల ఆధారంగా వచ్చిన ఫలితాలను బట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన జగన్..గురువారం 21 మంది తో కూడిన మూడో జాబితా రిలీజ్ చేసారు. ఈ జాబితాలో కూడా చాలామంది సిట్టింగ్ లకు షాక్ తగలగా..కడప జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం ఊపిరి పోశారు జగన్.
కడప సొంత జిల్లాల్లో రెండు, మూడు స్థానాల్లో మార్పులు ఖాయమని ప్రచారం సాగింది. అయితే మూడో జాబితాలో కడప జిల్లాలో కేవలం రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని మాత్రమే మార్చారు. అక్కడి సీటును ప్రస్తుత ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేస్తున్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి కేటాయించారు. ఆకేపాటి అమర్నాథరెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉండడం, ఇదే తరుణంలో మల్లికార్జున్ రెడ్డి పట్ల అధిష్టానం కొంత అసంతృప్తితో ఉండడంతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక వైసీపీ మూడో లిస్ట్ – అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ ల లిస్ట్ చూస్తే..
- దర్శి – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
- పూతలపట్టు – ఎం.సునీల్
- చిత్తూరు – విజయేంద్ర రెడ్డి
- మదనపల్లి – నిస్సార అహ్మద్
- టెక్కలి -దువ్వాడ శ్రీనివాస్
- చింతలపూడి – కంబం విజయ జయరాజ్
- రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి
- సత్యవేడు – గురుమూర్తి
- పెనమలూరు – జోగి రమేష్
- పెడన – ఉప్పల రాము
- రాజంపేట -ఆకేపాటి అమర్‌నాధ్
- ఆలూరు – విరుపాక్షి
- కోడుమూరు – డాక్టర్ సతీష్
- గూడూరు – మెరుగు మురళి
ఎంపీ ఇంచార్జ్ లను చూస్తే..
- విజయవాడ – కేశినేని నాని
- విశాఖపట్నం ఎంపీ – బొత్స ఝాన్సి
- శ్రీకాకుళం – పేరాడ తిలక్
- కర్నూల్ ఎంపీ – గుమ్మనూరి జయరాం
- తిరుపతి ఎంపీ – కోనేటి ఆదిమూలం
- ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
శ్రీకాకుళం జడ్పీ ఛైర్మన్ గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్ఛాపురం జడ్పీటీసీగా ఈమె పని చేస్తున్నారు.
Read Also :