KA Paul : జనసేన పార్టీ పై కేఏ పాల్ సంచలన కామెంట్స్
KA Paul : టీడీపీ-జనసేన కూటమి ఇకపై ఏనాడూ గెలవలేదని పాల్ ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల ఎంపిక విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు
- Author : Sudheer
Date : 11-03-2025 - 8:21 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటములపై ముఖ్యంగా జనసేన పార్టీ (Janasenaparty ) మరియు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ-జనసేన కూటమి ఇకపై ఏనాడూ గెలవలేదని పాల్ ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల ఎంపిక విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పిఠాపురం మాజీ టీడీపీ నేత వర్మ(Varma)కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా, పవన్ తన అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడని ఆరోపించారు. ఇది పవన్ కల్యాణ్ వైఖరి ఏంటో స్పష్టంగా చూపిస్తోందని, కేవలం కుటుంబ ప్రయోజనాల కోసమే జనసేన పనిచేస్తోందని విమర్శలు గుప్పించారు.
CM Revanth : కేటీఆర్ పిచ్చోడు – సీఎం రేవంత్
జనసేన పార్టీ నిజమైన ప్రజా పార్టీ కాదని, పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసారు పాల్. గత ఎన్నికల్లో పవన్ చెప్పిన మాటలపై విశ్వాసం పెట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలసి నాయకత్వానికి న్యాయం చేయలేకపోతున్నారని ఆరోపించారు. వర్మ వంటి వ్యక్తులు కూటమికి సహకరించినా, చివరికి వారిని మోసం చేసేలా జనసేన వ్యవహరించిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు హామీలు ఇస్తూ, అనంతరం వాటిని తుంగలో తొక్కడం జనసేనకు అలవాటైందన్నారు.
Pregnancy : గర్భధారణ సమయంలో వాంతులు అవ్వడానికి కారణం ఏంటి..?
రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు గెలిచే అవకాశమే లేదని, ప్రజలు ఇప్పటికే వీరి నిజస్వరూపాన్ని అర్థం చేసుకున్నారని అన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత దొరబాబు జనసేనలో చేరడాన్ని తప్పుబడుతూ తెలివైన నాయకులు జనసేనలో చేరరని సెటైర్లు వేశారు. ఈ కూటమి మరో 9 నెలల్లోనే పూర్తిగా మాయమవుతుందని, వారి చాప్టర్ క్లోజ్ అవడం ఖాయమని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జనసేన ప్రజల కోసం పని చేయకపోతే, ప్రజలు కూడా వారికి సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని కేఏ పాల్ స్పష్టం చేశారు.