JD Lakshmi Narayana : వైసీపీ లో చేరడం ఫై క్లారిటీ ఇచ్చిన జేడీ లక్ష్మినారాయణ
తాను ఒక కార్యక్రమంలో నాడు - నేడు, ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని (వైసీపీ GOVT) అభినందించిన మాట వాస్తవమేనని, అంత మాత్రాన తాను వైసీపీలో చేరుతున్నానని ప్రచారం చేయడం తగదని
- By Sudheer Published Date - 11:53 AM, Mon - 30 October 23

సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణ (JD Lakshmi Narayana)..వైసీపీ (YCP) లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను ఒక కార్యక్రమంలో నాడు – నేడు, ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని (వైసీపీ GOVT) అభినందించిన మాట వాస్తవమేనని, అంత మాత్రాన తాను వైసీపీలో చేరుతున్నానని ప్రచారం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిని పూర్వ విద్యార్ధుల కార్యక్రమానికి ఆహ్వానించేందుకు సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణ వెళ్లారు. ఆ సమయంలో అక్కడ జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతోంది. అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణ సంక్షేమ కార్యక్రమాలపై, జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇక అప్పట్నించి లక్ష్మీ నారాయణ వైసీపీలో చేరిపోతున్నారనే ప్రచారం విస్తృతమైంది. అందుకే లక్ష్మీ నారాయణ ట్వీట్ ద్వారా దీనిపై స్పందించారు. వైసీపీలో చేరుతున్నాననే ప్రచారాన్ని ఖండించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టత ఇచ్చారు.
Read Also : Vande Bharat Accident : వందేభారత్ ఢీకొని.. ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి