Janasena : విశాఖ గర్జన కు స్పందనలేకే.. పవన్ టూర్‌పై కుట్రలు – జనసేన పొతిన మహేష్
జనసేన అధినేత పవన్ కళ్యాణకు వస్తున్న జనాదరణ తో వైసిపి వెన్నులో వణకు పుడుతుందని జనసేన నేత పొతిన మహేష్...
- Author : Prasad
Date : 16-10-2022 - 10:45 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత పవన్ కళ్యాణకు వస్తున్న జనాదరణ తో వైసిపి వెన్నులో వణకు పుడుతుందని జనసేన నేత పొతిన మహేష్ అన్నారు. విశాఖపట్నం లో పవన్ కళ్యాణ్ ర్యాలీ ని అడ్డుకునేందుకు పాలకులు పోలీసులు ను అడ్డం పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. మంత్రులు కార్ల పై దాడి కుట్ర పారకపోవడంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చారని.. విశాఖ పోలీస్ కమిషనర్ అధికార పార్టీ నేతల ఆదేశాలతో పని చేశారని ఆయన ఆరోపించారు. విశాఖ సీపీ శ్రీకాంత్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విధుల్లో వారి నిర్లక్ష్య వైఖరి, చేతకానితనం కప్పిపుచ్చుకునేందుకే.. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. దాడి చేసి చంపాలనే ఉద్దేశం ఉంటే వేలమంది జనసేన పార్టీ కార్యకర్తల మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు, పెద్దలు దర్జాగా నడుచుకొని వెళ్లే వారా అని ఆయన ప్రశ్నించారు, అసలు పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో అదే మార్గం లో మంత్రులు రావడం వెనుక ఉన్న వైసీపీ కుట్ర అర్ధం అవుతుందన్నారు. విశాఖ గర్జన కు స్పందన లేక.. పవన్ కళ్యాణ్ టూర్ ని వివాదం చేయాలనే కుట్ర చేశారని పొతిన మహేష్ ఆరోపించారు.