Adavi Thalli Bata : ‘అడవి తల్లి బాట’పై జనసేన ప్రత్యేక వీడియో విడుదల
గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అడవి తల్లి బాట కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమంపై జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. గిరిజనులతో పవన్ మమేకం అవడం, వాళ్లతో కలిసి నృత్యం చేయడాన్ని వీడియోలో చూపించారు.
- By Latha Suma Published Date - 11:20 AM, Thu - 10 April 25

Adavi Thalli Bata: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ‘అడవి తల్లి బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అడవి తల్లి బాట కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమంపై జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. గిరిజనులతో పవన్ మమేకం అవడం, వాళ్లతో కలిసి నృత్యం చేయడాన్ని వీడియోలో చూపించారు.
#AdaviThalliBaata Exclusive video
Pawan Kalyan – A Revelation in Indian Politics !#PawanKalyanAneNenu pic.twitter.com/UQzsNtMNo2
— JanaSena Party (@JanaSenaParty) April 9, 2025
ఇక, ఈ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్లతో పాటు పాఠశాలలు, తాగునీటి సౌకర్యం, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంతో గిరిజన గ్రామాలకు మహర్ధశ పట్టనుంది. దీంతో పవన్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద రూ. 1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల మేర 625 గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో జన్ మన్ పథకం కింద మంజూరైన రహదారులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. పెదపాడు గ్రామంలో గడ్డపార పట్టి భూమి పూజ చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం పెదపాడు గ్రామస్తులతో సమావేశమయ్యారు. మీతో పాటు నడిచి మీ కష్టాన్ని చూశాను కనుకనే, ఈ రహదారులను పోరాడి సాధించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో మాకు ఓటు వేయకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , నేను చర్చించుకుని ఈ రహదారులను మంజూరు చేయించామన్నారు.
Read Also: HSRP Features: ఏమిటీ.. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ? ఫీచర్స్ ఏమిటి ?