Jagan : ఆడవాళ్లను పెట్టి జగన్ రాజకీయాలు – టీడీపీ
Jagan : 'నేను మహిళా ఛైర్పర్సన్ ఉండగా అనేక విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మహిళల విషయంలో ఇప్పుడు జగన్ రాజకీయం చేస్తున్నారు
- By Sudheer Published Date - 02:15 PM, Wed - 23 October 24

రాజకీయం చేయడానికి మహిళలే (Womes) దొరికారా అని వైసీపీధినేత , మాజీ సీఎం జగన్ (Jagan) ను టీడీపీ (TDP) ప్రశ్నించింది. వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ జగన్ పై చేసిన ఆరోపణల వీడియోను Xలో పోస్ట్ చేసింది. ‘నేను మహిళా ఛైర్పర్ పర్సన్ గా ఉండగా అనేక విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మహిళల విషయంలో ఇప్పుడు జగన్ రాజకీయం చేస్తున్నారు. ఆనాడు మహిళలపై రోజుకో ఘటన జరిగినా బయటకు రాలేదు. చాలా విషయాలు తొక్కిపెట్టారు’ అని ఆమె విమర్శించారు.
ఎన్నికల ముందే నుండి కాదు..ఫలితాల అనంతరం కూడా వైసీపీ కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. వరుస పెట్టి నేతలు ఆ పార్టీ కి గుడ్ బై చెప్పి..ఐదేళ్ల పాలనలో జగన్ వల్ల వారు ఎంత నరకం చూసారో చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) సైతం పార్టీ కి రాజీనామా చేసింది.
అనంతరం ఆమె మాట్లాడుతూ..వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. వైసీపీ ని నడిపించడంతో పాటు పరిపాలనలోనూ వైఎస్ జగన్‌కి బాధ్యత లేదని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని తెలిపారు. అందుకు ఈ ఎన్నికల తీర్పే నిదర్శనమని తెలిపారు. జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదనుకునే వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఇప్పుడు గుడ్ బుక్ పేరుతో ఆయన మరోసారి మోసం చెేసేందుకు సిద్ధపడుతున్నారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. పార్టీలో తనతో పాటు చాలామందికి కొంతకాలంగా తీవ్ర అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇది తమకే కాకుండా రాష్ట్ర ప్రజానీకానికి జరుగుతున్న మోసం, అన్యాయమని ఆమె పేర్కొన్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకైనా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. జగన్ చేస్తున్న మోసాన్ని వ్యతిరేకించడానికే తాను పార్టీ వీడుతున్నట్లు తెలిపారు.
తాను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో తనవంతు సాయం చేశానన్న ఆమె.. జగన్ పరిపాలన కాలంలో రాష్ట్ర మహిళలకు స్వర్ణయుగం అనుకుంటే అది చాలా పొరపాటు అని అన్నారు. ఆయన హయాంలో కూడా మహిళల పట్ల ఎన్నో వికృత సంఘటనలు జరిగాయని తెలిపారు. అప్పుడు సీఎంగానీ, హోంమంత్రిగానీ ఎందుకు బాధిత కుటుంబాలను పరామర్శించలేదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఇప్పుడు రాజకీయాలు చేయడానికి మహిళలను అడ్డుపెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ఆమె అన్నారు.
నేను మహిళా చైర్ పర్సన్ గా ఉండగా, అనేక విషయాలు నాడు ప్రభుత్వం ముందు పెట్టినా పట్టించుకోలేదు. మహిళల విషయంలో ఇప్పుడు జగన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. జగన్ రెడ్డి పాలన ఏమైనా మహిళలకు స్వర్ణయుగమా ? రోజుకో వికృతమైన ఘటన నాడు మహిళల పై జరిగినా, ఏ నాడు జగన్ రెడ్డి బయటకు రాలేదు, ఒక్క… pic.twitter.com/8epSL3mbZP
— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024
Read Also : Attack On Aggipetti Macha : తిరుపతిలో అగ్గిపెట్టె మచ్చా పై దాడి