Jagan: సెక్యూరిటీ పునరుద్ధరణపై హైకోర్టులో జగన్ పిటిషన్ వాయిదా
ముఖ్యమంత్రిగా తనకు ఇచ్చిన సెక్యూరిటీని మరల పునరుద్ధరించాలంటూ వైసీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
- By manojveeranki Published Date - 01:51 PM, Wed - 7 August 24

అమరావతి: ముఖ్యమంత్రిగా తనకు ఇచ్చిన సెక్యూరిటీని మరల పునరుద్ధరించాలంటూ వైసీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Ys Jagan) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు పై ఈరోజు హైకోర్టులో (Ap High Court) విచారణ జరిగింది.
విచారణ సమయంలో, అడ్వకేట్ జనరల్ కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. జగన్ (Jagan) తరపు సీనియర్ న్యాయవాది శ్రీరామ్, తమకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్రయాణానికి అనుకూలంగా లేదని చెప్పారు. జామర్ వెహికల్ (Jammer Vehicle) కూడా అందించాలని కోరారు.
న్యాయమూర్తి.. మంచి బీపీ వెహికల్ ఇవ్వడం కోసం ప్రభుత్వానికి ఇబ్బంది ఏముంది అని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ బీపీ వెహికల్, జామర్ వెహికల్ ఇచ్చే విషయంలో అధికారులను అడిగి వివరాలు సమర్పిస్తామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. తదుపరి విచారణ మధ్యాహ్నం 2:15 గంటలకు కోర్ట్ (Court) వాయిదా వేసింది.
జగన్, తన పిటిషన్‌లో జూన్ 3 నాటికి ఉన్న భద్రతను (Security) పునరుద్ధరించాలని కోరారు. ఎన్నికల ఫలితాల తర్వాత నెలరోజుల్లోనే భద్రతను తగ్గించి, జడ్ ప్లస్ స్థాయి భద్రతను తగ్గించారని, భద్రతా సిబ్బందిని 139 నుండి 59కి తగ్గించారని తెలిపారు.
ఈ విషయంపై, పోలీసు శాఖ మరియు ప్రభుత్వం జగన్ (Jagan) చేసిన ఆరోపణలను కొట్టిపారేసాయి. నిబంధనల మేరకు భద్రతను కేటాయించామని, జడ్ ప్లస్ (Z+ Security) సెక్యూరిటీ కొనసాగుతుందని స్పష్టం చేశాయి. సీఎం హోదా భద్రత కుదరదని అధికార వర్గాలు తెలిపారు. తదుపరి విచారణకు సంబంధించి, హైకోర్టు మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేసింది.