AP : ఇవాళ జగనన్న విద్యాదీవేన నిధుల విడుదల…మదనపల్లిలో బటన్ నొక్కనున్న సీఎం జగన్..!!
- By hashtagu Published Date - 05:39 AM, Wed - 30 November 22

ఆర్థికస్థోమత లేక చదువుకుల దూరం అవుతున్న విద్యార్థుల కోసం ఏపీ సీఎం జగన్…జగనన్న విద్యాదీవేన పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ను అమలు చేస్తోంది సర్కార్. తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడకుండా కాలేజీలకు మొత్తం ఫీజును ప్రభుత్వమే భరిస్తోంది.
ఇందులో భాగంగానే నేడు జగనన్న విద్యాదీవేన పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి నిధులను జమ చేయనున్నారు. మొత్తం రూ. 694కోట్లు జమ కానున్నాయి. దీతో 11.02లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం ఈ పథకం కింద 12,401కోట్ల నిధులను విడుదల చేసింది.