Vijayawada Floods : చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే వరదలు – జగన్ కీలక వ్యాఖ్యలు
వర్షాలపై వాతావరణ శాఖ ఆగస్టు 28నే హెచ్చరించిందని, వరదలపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు
- Author : Sudheer
Date : 02-09-2024 - 10:16 IST
Published By : Hashtagu Telugu Desk
చంద్రబాబు (Chandrababu) చేసిన తప్పిదం వల్లే విజయవాడ ను వరదలు (Vijayawada Flood) ముచ్చేత్తాయి అన్నారు మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ (Jagan). నాల్గు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి మొదలైన వర్షం శనివారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజులో 29 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని పాతబస్తీ, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్, పలు కాలనీలు, శివారు ప్రాంతాలలో భారీగా వరద పోటెత్తింది. రెండు రోజులుగా నగరంలోని అనేక కాలనీ లు నీటిలో ఉన్నాయి. దీంతో కాలనీ వాసులు తాగేందుకు నీరు లేక..తినేందుకు తిండి లేక ఎవరైనా సాయం చేస్తారా అని ఎదుచూస్తున్నారు. ప్రభుత్వం సైతం ముమ్మరంగా సహాయ సహకారాలు అందజేయడం చేసింది. సీఎం చంద్రబాబు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
We’re now on WhatsApp. Click to Join.
మాజీ సీఎం జగన్ సైతం సోమవారం వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. మానవ తప్పిదం వల్లే విజయవాడకు వరదలు వచ్చాయన్నారు. వర్షాలపై వాతావరణ శాఖ ఆగస్టు 28నే హెచ్చరించిందని, వరదలపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజలను అప్రమత్తం చేయలేదని , సకాలంలో ప్రభుత్వం స్పందించి ఉంటే ఇంత ముంపు ఉండేదికాదన్నారు. చంద్రబాబు ఇంటిని కాపాడేందుకు విజయవాడను ముంచేశారన్నారు. విజయవాడ ప్రజలకు ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షమంది నిర్మాసితులకు ఏర్పాటు చేసిన క్యాంపులు సరిపోవని , తక్షణమే మరికొన్నింటిని ఏర్పాటు చేయాలని , వరద బాధితులకు వెంటనే ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు.
Read Also : Pawan Kalyan : నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్ – నారా లోకేష్