Pawan Kalyan’s Son Injured : పవన్ కొడుకు కోసం జగన్ ప్రార్థనలు..మార్పు వచ్చిందా..?
Pawan Kalyan's Son Injured : రాజకీయ, సినీ ప్రముఖులు ఈ ప్రమాదంపై స్పందిస్తున్నారు. చిన్నారికి జరిగిన ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
- By Sudheer Published Date - 04:24 PM, Tue - 8 April 25

జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident )లో గాయపడిన ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. రాజకీయ, సినీ ప్రముఖులు ఈ ప్రమాదంపై స్పందిస్తున్నారు. చిన్నారికి జరిగిన ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan), మంత్రి నారా లోకేష్ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాల ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోగ్యం పై ఆరా తీశారు.
ఈ ప్రమాదం సింగపూర్‌లోని రివర్ వ్యాలీ రోడ్డులో ఉన్న మూడు అంతస్తుల బిల్డింగ్‌లోని “టమాటో కుకింగ్ స్కూల్”లో జరిగింది. ఈ స్కూల్‌లో చిన్నపిల్లలకు కుకింగ్ శిక్షణ ఇచ్చే క్యాంప్ నిర్వహిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో మార్క్ శంకర్ సహా 20 మంది చిన్నారులు స్కూల్‌లో ఉన్నారు. సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెంటనే స్పందించి మంటలను అదుపు చేయగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కాగా, మెగా స్టార్ చిరంజీవి చిన్నారి ఆరోగ్యంపై సమాచారం ఇచ్చారు. శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ఈ ఘటనపై వైఎస్ జగన్ సైతం “ఇది దిగ్భ్రాంతికరమైన విషయం. చిన్నారి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ కుటుంబానికి మద్దతుగా ఉన్నాను” అని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ లు కూడా భగవంతుడు శంకర్‌ను త్వరగా కోలుకునేలా చూసాలని ఆకాంక్షించారు. ఇలా అన్ని పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు పవన్ కుమారుడి ఆరోగ్యం కోసం మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేస్తున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ను , ఆయన కుటుంబ సభ్యులను విపరీతంగా విమర్శించడం , అసభ్యంగా మాట్లాడడం చేసిన జగన్..ఇప్పుడు క్షేమం కోరుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తూ..జగన్ లో మార్పు మొదలైనట్లు ఉందని మాట్లాడుకుంటున్నారు.
I am shocked to know about the fire accident at a school in Singapore in which @PawanKalyan garu's son, Mark Shankar got injured. My thoughts are with the family in this difficult time. Wishing him a swift and complete recovery.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2025
Shocked to hear about the fire accident at a school in Singapore in which @PawanKalyan Anna's son, Mark Shankar, sustained injuries. Wishing him a speedy and full recovery. Strength and prayers to the family during this tough time.
— Lokesh Nara (@naralokesh) April 8, 2025
సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) April 8, 2025